Telugu Global
CRIME

వేశ్యలను కూడా వదలని కామాంధులు.... 9మంది గ్యాంగ్ రేప్....

వాళ్లు ముగ్గురు వేశ్యలు…. కొందరు కామాంధులు వాళ్లను కూడా వదల్లేదు. పొట్టకూటి కోసం ఆ పనిచేస్తున్న వారిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేశారు. డబ్బులు ఇవ్వకుండా లాగేసుకొని పంపించేశారు. ఈ దారుణ సంఘటన ఢిల్లీకి సమీపాన గల నోయిడాలో జరిగింది. నోయిడాలోని లజ్ పత్ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ లో ముగ్గురు వేశ్యలు తమను బుక్ చేసుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ ముగ్గురు మహిళలను రూ. 3వేల […]

వేశ్యలను కూడా వదలని కామాంధులు.... 9మంది గ్యాంగ్ రేప్....
X

వాళ్లు ముగ్గురు వేశ్యలు…. కొందరు కామాంధులు వాళ్లను కూడా వదల్లేదు. పొట్టకూటి కోసం ఆ పనిచేస్తున్న వారిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేశారు. డబ్బులు ఇవ్వకుండా లాగేసుకొని పంపించేశారు. ఈ దారుణ సంఘటన ఢిల్లీకి సమీపాన గల నోయిడాలో జరిగింది.

నోయిడాలోని లజ్ పత్ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ లో ముగ్గురు వేశ్యలు తమను బుక్ చేసుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ ముగ్గురు మహిళలను రూ. 3వేల చొప్పున మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అనంతరం నోయిడా లోని ఓ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు.

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌గా ఎనిమిది మంది, ఒకరు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు వేశ్యలను బుక్ చేసుకుని ఫాం హౌస్ కు తీసుకురాగా.. అక్కడికి మరో ఏడుగురు వచ్చారు. దీంతో 9 మంది వచ్చారని అభ్యంతరం పెట్టి…. వెళ్లిపోవడానికి ఆ ముగ్గురు వేశ్యలు ప్రయత్నించారు.

అయినా వదలకుండా.. వారు ఒప్పుకోకున్నా.. వారిపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు ఆ తొమ్మిది మంది. అనంతరం ఒప్పుకోని వారిని కొట్టారు కూడా.. వారికి ఇచ్చిన మూడు వేల అడ్వాన్స్ ను కూడా వారి వద్ద నుంచి లాక్కున్నారు ఆ కామాంధులు.

తెల్లవారుజామున 5 గంటలకు వారిని మెయిన్ రోడ్డుపై వదిలేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ 9 మంది కామాంధుల కోసం వెతుకులాట ప్రారంభమైంది.

First Published:  20 Jun 2019 1:35 AM GMT
Next Story