Telugu Global
Cinema & Entertainment

కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన... తరుణ్ భాస్కర్

పెళ్లిచూపులు సినిమా తో తరుణ్ భాస్కర్ కి దర్శకుడి గా మంచి పేరు వచ్చింది. అటు యూత్ ని ఇటు కుటుంబ ప్రేక్షకుల ని ఒకేరకంగా మెప్పించాడు తరుణ్. ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా యూత్ ని బాగానే ఆకర్షించింది అని చెప్పవచ్చు. ఫలక్నుమా దాస్ సినిమా లో పోలీస్ పాత్ర లో నటించాక అందరూ తరుణ్ నటుడిగా సెటిల్ అవుతాడు అని పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయమై తరుణ్ […]

tarun-bhaskar-about-sky-diving
X

పెళ్లిచూపులు సినిమా తో తరుణ్ భాస్కర్ కి దర్శకుడి గా మంచి పేరు వచ్చింది. అటు యూత్ ని ఇటు కుటుంబ ప్రేక్షకుల ని ఒకేరకంగా మెప్పించాడు తరుణ్. ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా యూత్ ని బాగానే ఆకర్షించింది అని చెప్పవచ్చు. ఫలక్నుమా దాస్ సినిమా లో పోలీస్ పాత్ర లో నటించాక అందరూ తరుణ్ నటుడిగా సెటిల్ అవుతాడు అని పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయమై తరుణ్ ఒక క్లారిటీ ఇచ్చాడు.

“నాకు దర్శకత్వం చేయడమే ఇష్టం. దానికే నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ని ఇస్తాను. త్వరలో నే మీ అందరినీ మెప్పించడానికి ఒక సూపర్ కూల్ సినిమాని రెడీ చేస్తున్నాను. అంతే కాకుండా ఈ నగరానికి ఏమైంది సినిమా ని సిరీస్ రూపం లో కూడా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి రెండూ కమింగ్ సూన్” అని తన ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం తరుణ్… విజయ్ దేవరకొండ నిర్మాత గా వస్తున్న ఒక చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ పూర్తి కాగానే తన సొంత సినిమాల ని ముందుకు తీసుకెళ్తాడట.

First Published:  19 Jun 2019 2:11 AM GMT
Next Story