Telugu Global
National

వీణా మాలిక్ తో సానియా మాలిక్ ట్విట్టర్ వార్

భారత్ చేతిలో పాక్ ఓటమితో అసహనం పాక్ క్రికెట్ జట్టుతో సానియా పచార్లపై విమర్శలు ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాక్ జట్టు భారత చేతిలో చిత్తుగా ఓడటాన్ని…పాక్ అభిమానులు మాత్రమే కాదు…పాక్ సినీనటి వీణా మాలిక్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పాక్ కోడలు, షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై ట్విట్టర్ ద్వారా విసుర్లు విసురుతోంది. పాక్ జట్టు సభ్యులతో కలిసి సానియా మీర్జా ఏడాదికూడా నిండని తన కొడుకుతో కలిసి ఇంగ్లండ్ లో పచార్లు చేయటాన్ని […]

వీణా మాలిక్ తో సానియా మాలిక్ ట్విట్టర్ వార్
X
  • భారత్ చేతిలో పాక్ ఓటమితో అసహనం
  • పాక్ క్రికెట్ జట్టుతో సానియా పచార్లపై విమర్శలు

ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాక్ జట్టు భారత చేతిలో చిత్తుగా ఓడటాన్ని…పాక్ అభిమానులు మాత్రమే కాదు…పాక్ సినీనటి వీణా మాలిక్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పాక్ కోడలు, షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై ట్విట్టర్ ద్వారా విసుర్లు విసురుతోంది.

పాక్ జట్టు సభ్యులతో కలిసి సానియా మీర్జా ఏడాదికూడా నిండని తన కొడుకుతో కలిసి ఇంగ్లండ్ లో పచార్లు చేయటాన్ని పాక్ నటి ఏమాత్రం సహించలేకపోతోంది.

పాక్ మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య హోదాలో జట్టు వెంట ఉన్న సానియా మీర్జా ఉనికినే వీణా మాలిక్ ప్రశ్నిస్తోంది.

భారత్ చేతిలో ఓటమి పొందిన రోజు ముందు రాత్రి పాక్ జట్టు సభ్యులతో కలిసి మాంచెస్టర్ సిటీలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్, పబ్ ల వెంట అర్థరాత్రి వరకూ సానియా తిరగటం పట్ల వీణా మాలిక్ తప్పుపట్టింది.

ఏడాది కూడా నిండని పసివాడిని వేసుకొని జంక్ ఫుడ్ సెంటర్లలో తిరగటం ఏమంత మంచిదికాదని ట్విట్టర్ ద్వారా సానియాను హెచ్చరించింది.

ఓ టెన్నిస్ క్రీడాకారిణిగా ఉన్న సానియాకు జంక్ ఫుడ్ తీసుకోకూడదని తెలియదా అంటూ ప్రశ్నించింది.

అయితే…సానియా సైతం తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారానే ప్రతిసమాధానం ఇచ్చింది. ఏడాది నిండని తన కొడుకుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తనకు ఎవ్వరూ చెప్పాల్సిన పనిలేదని.. ఎవరిబాగు వారు చూసుకొంటే మేలంటూ ప్రతిసమాధానం ఇచ్చింది.

పాకిస్థాన్ ఇంటి కోడలిగా ఉన్నా…సానియా మాత్రం హైదరాబాద్ లోనే నివాసం ఉంటూ…భారత్ మాత్రమే తనకు పుట్టిల్లని పదేపదే చెబుతూ ఉండటం విశేషం.

First Published:  18 Jun 2019 4:50 AM GMT
Next Story