Telugu Global
NEWS

ఒలింపిక్ హాకీ క్వాలిఫైయర్స్ ఫైనల్లో భారత్

సెమీఫైనల్లో జపాన్ పై భారత్ భారీవిజయం సౌతాఫ్రికాతో నేడు భారత్ టైటిల్ సమరం ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ హాకీ క్వాలిఫైయర్స్ రౌండ్ కు అర్హత సంపాదించింది. భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్స్ ఫైనల్ రౌండ్ తొలి సెమీస్ లో ఆసియా క్రీడల విజేత జపాన్ ను 7-2 గోల్స్ తో భారత్ చిత్తు చేసింది. మరికొద్దిగంటల్లో జరిగే టైటిల్ సమరంలో సౌతాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.  ఏకపక్షంగా సాగిన […]

ఒలింపిక్ హాకీ క్వాలిఫైయర్స్ ఫైనల్లో భారత్
X
  • సెమీఫైనల్లో జపాన్ పై భారత్ భారీవిజయం
  • సౌతాఫ్రికాతో నేడు భారత్ టైటిల్ సమరం

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ హాకీ క్వాలిఫైయర్స్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

భువనేశ్వర్ లోని కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్స్ ఫైనల్ రౌండ్ తొలి సెమీస్ లో
ఆసియా క్రీడల విజేత జపాన్ ను 7-2 గోల్స్ తో భారత్ చిత్తు చేసింది.

మరికొద్దిగంటల్లో జరిగే టైటిల్ సమరంలో సౌతాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

ఏకపక్షంగా సాగిన ఈ సెమీస్ పోరు మొదటి క్వార్టర్ 20వ నిముషానికే రెండుజట్లు చెరో రెండుగోల్స్ చేసి 2-2తో సమఉజ్జీలుగా నిలిచాయి. ఆ తర్వాత నుంచి పోటీ భారత్ షోగానే సాగింది.

ఆట మొదటిభాగానికి 4-2తో పైచేయి సాధించిన భారత్ ఆ తర్వాత 20 నిముషాలలోనే ఆధిక్యాన్ని 6-2కు పెంచుకోగలిగింది. ఆట ముగిసే సమయంలో మరో గోలు చేయడం ద్వారా భారత్ 7-2 గోల్స్ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది.

అంతకు ముందు జరిగిన తొలిసెమీఫైనల్లో సౌతాఫ్రికా 2-1 గోల్స్ తో అమెరికాను అధిగమించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

భారత ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.

First Published:  14 Jun 2019 7:55 PM GMT
Next Story