Telugu Global
NEWS

ప్రపంచ ఫుట్ బాల్ 101వ ర్యాంక్ లో భారత్

పీఫా ర్యాంకింగ్స్ టాప్ 100లో చోటులేని భారత్ ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో 204 దేశాలు పోటీపడుతుంటే…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ మాత్రం.. మొదటి 100 ర్యాంకుల్లో చోటు సంపాదించలేకపోయింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 101వ ర్యాంక్ కు పడిపోయింది. థాయ్ లాండ్ వేదికగా ముగిసిన కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలో భారత్ ఓ గెలుపు, ఓ ఓటమి రికార్డుతో […]

ప్రపంచ ఫుట్ బాల్ 101వ ర్యాంక్ లో భారత్
X
  • పీఫా ర్యాంకింగ్స్ టాప్ 100లో చోటులేని భారత్

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో 204 దేశాలు పోటీపడుతుంటే…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ మాత్రం.. మొదటి 100 ర్యాంకుల్లో చోటు సంపాదించలేకపోయింది.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 101వ ర్యాంక్ కు పడిపోయింది. థాయ్ లాండ్ వేదికగా ముగిసిన కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలో భారత్ ఓ గెలుపు, ఓ ఓటమి రికార్డుతో నిలిచినా ర్యాంకింగ్ లో ఏ మాత్రం మార్పు లేదు.

భారత్ మొత్తం 1219 పాయింట్లతో 101వ ర్యాంకులో కొనసాగుతోంది.

ఆసియాదేశాలలో ఇరాన్ 20వ ర్యాంకులో, జపాన్ 28, దక్షిణ కొరియా 37, ఆస్ట్రేలియా 47, ఖతర్ 55 ర్యాంకుల్లో నిలిచాయి.
ప్రపంచ టాప్ ఫైవ్ ర్యాంకుల్లో నిలిచిన జట్లలో బెల్జియం, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లండ్, పోర్చుగల్ ఉన్నాయి.

First Published:  15 Jun 2019 12:05 AM GMT
Next Story