Telugu Global
Cinema & Entertainment

మొదటి సినిమా రిలీజే కాలేదు... అప్పుడే రెండో సినిమా....

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుళ్ మోహన్ అనే తమిళ అమ్మాయి హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుంది. ఈ సినిమా లో ప్రియాంక పాత్ర చాలా కీలకం అని, బాగా నటించగలదు అనే నమ్మకం తో విక్రమ్ ఆమెని ఈ సినిమా లోకి తీసుకున్నాడు […]

మొదటి సినిమా రిలీజే కాలేదు... అప్పుడే రెండో సినిమా....
X

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుళ్ మోహన్ అనే తమిళ అమ్మాయి హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుంది.

ఈ సినిమా లో ప్రియాంక పాత్ర చాలా కీలకం అని, బాగా నటించగలదు అనే నమ్మకం తో విక్రమ్ ఆమెని ఈ సినిమా లోకి తీసుకున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే ఇప్పుడు ప్రియాంక తన రెండో చిత్రాన్ని సైన్ చేసింది.

త్వరలో శర్వానంద్ హీరో గా లఘు చిత్రాల దర్శకుడు కిషోరుడు అరంగేట్రం చేస్తున్న ఒక సినిమా లో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా గురించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక శర్వానంద్ ప్రస్తుతం 96 రీమేక్ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

First Published:  14 Jun 2019 1:51 AM GMT
Next Story