Telugu Global
Cinema & Entertainment

అమెరికా వెళ్లనున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ ఘోర ఓటమి చెందడానికి గల కారణాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాడు.  అయితే పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఉత్సవాలకు ముఖ్య అతిధి గా హాజరు కానున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. జులై 4 నుండి జులై 6 వరకు వ్వాషింగ్టన్ డీసీ లో జరిగే ఈ తానా కాన్ఫరెన్స్ కి పవన్ తప్పకుండా హాజరు అవుతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ అసోసియేషన్ […]

అమెరికా వెళ్లనున్న పవన్?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ ఘోర ఓటమి చెందడానికి గల కారణాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ త్వరలో జరగనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఉత్సవాలకు ముఖ్య అతిధి గా హాజరు కానున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

జులై 4 నుండి జులై 6 వరకు వ్వాషింగ్టన్ డీసీ లో జరిగే ఈ తానా కాన్ఫరెన్స్ కి పవన్ తప్పకుండా హాజరు అవుతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ అసోసియేషన్ సభ్యులు పవన్ కి ప్రత్యేక ఆహ్వానం పంపారని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మందికి ఈ ఈవెంట్ ఆహ్వానాలు వెళ్లాయట. అయితే పవన్ కళ్యాణ్ ఈ వేడుకకి వస్తే ఎన్ఆర్ఐ లని, యువతని భారీగా ఆకట్టుకోవచ్చు అనే భావన లో ఉన్నారట. పవన్ కళ్యాణ్ దీని పై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

First Published:  14 Jun 2019 4:30 AM GMT
Next Story