Telugu Global
Cinema & Entertainment

మన్మధుడు 2 టీజర్ ను చూసి.... ఆఫీసర్ నిర్మాత బాధ పడుతున్నాడు

అప్పుడెప్పుడో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో శివ అనే సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా పరిశ్రమ లో శివ ఇప్పటికీ ఒక పెద్ద కల్ట్ క్లాసిక్ సినిమా. ఈ సినిమా ఎన్నో అద్భుతాల్ని ప్రేక్షకులకి చూపించింది. ఆ తర్వాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ టాప్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన నుంచి […]

మన్మధుడు 2 టీజర్ ను చూసి.... ఆఫీసర్ నిర్మాత బాధ పడుతున్నాడు
X

అప్పుడెప్పుడో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో శివ అనే సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా పరిశ్రమ లో శివ ఇప్పటికీ ఒక పెద్ద కల్ట్ క్లాసిక్ సినిమా. ఈ సినిమా ఎన్నో అద్భుతాల్ని ప్రేక్షకులకి చూపించింది.

ఆ తర్వాత నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ టాప్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

అయితే గత కొద్ది కాలంగా ఆయన నుంచి వస్తున్న సినిమాలు అన్నీ పరాజయం పాలవుతున్నాయి. ఈ విషయం ఆయనకీ తెలిసిన కానీ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.

అయితే ఆ మధ్య నాగార్జున… రాము కి ఆఫీసర్ అనే సినిమా కి అవకాశం ఇచ్చారు. అందరూ నాగార్జున నిర్ణయాన్ని తప్పుబట్టారు… కానీ ఎందుకో ఆ సమయం లో రాము ని నాగార్జున నమ్మారు. చివరికి ఆ సినిమా పరాజయం పాలయింది. ఈ సినిమా ని సుధీర్ నిర్మించారు.

నిన్న మన్మధుడు 2 సినిమా టీజర్ విడుదల సందర్భం గా ఈ నిర్మాత టీజర్ ని షేర్ చేస్తూ “ఈయన తో ఆఫీసర్ లాంటి సినిమా తీసాం” అనే బాధ ని వ్యక్తపరిచారు. చూడబోతే ఈ నిర్మాత ఇంకా ఆఫీసర్ తీసినందుకు బాధ పడుతూనే ఉన్నాడు.

First Published:  14 Jun 2019 12:40 AM GMT
Next Story