Telugu Global
Cinema & Entertainment

సూర్య సినిమాలో మోహన్ బాబు

ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు మోహన్ బాబు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా సూర్య. ఇందులో ఓ కీలకమైన […]

సూర్య సినిమాలో మోహన్ బాబు
X

ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు మోహన్ బాబు. కృష్ణ నాయకుడిగా గతంలో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన మరో లైడీ డైరెక్టర్‌ సుధ కొంగర దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో సూర్య హీరోగా నటిస్తున్నాడు.

‘సూరరై పోట్రు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కూడా సూర్య. ఇందులో ఓ కీలకమైన పాత్రకు మోహన్ బాబు అయితే బాగుంటుందని సూర్య, సుథ.. మంచు లక్ష్మిని కలిశారు. ఆమె ద్వారా మోహన్ బాబును కలిసి కథ చెప్పారు. వెంటనే మోహన్ బాబు నటించడానికి ఒప్పుకున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి గురువారం మోహన్‌బాబు చెన్నై వెళ్లారు. శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారాయన. 6 నెలల కిందటే ఈ సినిమాకు మోహన్ బాబు సైన్ చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగులో వెంకటేష్ హీరోగా గురు అనే సినిమా తీశారు సుధా కొంగర.

First Published:  13 Jun 2019 7:02 PM GMT
Next Story