Telugu Global
NEWS

అజ్ఞాతంలోకి.... కోడెల కొడుకు, కూతురు

కోడెల కుటుంబం పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు కోడెల కొడుకు, కూతురును విచారణకు పిలుస్తారన్న సమాచారం తెలియగానే కోడెల కొడుకు, కూతురు అదృశ్యం అయినట్లు సమాచారం. బహుశా ముందస్తు బెయిల్‌ లభించేవరకు వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటకు రారని భావిస్తున్నారు. కోడెల అధికారంలో ఉన్న సమయంలో నరసరావుపేట పరిసర ప్రాంతాలను ఆయన, ఆయన కోడుకు, కూతురు సొంత సామ్రాజ్యంలాగా ఏలేశారు. అక్కడి అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకుని కోడెల టాక్స్‌ పేరుతో జనాలనుంచి డబ్బులను పిండేశారు. ఒక్క […]

అజ్ఞాతంలోకి.... కోడెల కొడుకు, కూతురు
X

కోడెల కుటుంబం పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు కోడెల కొడుకు, కూతురును విచారణకు పిలుస్తారన్న సమాచారం తెలియగానే కోడెల కొడుకు, కూతురు అదృశ్యం అయినట్లు సమాచారం. బహుశా ముందస్తు బెయిల్‌ లభించేవరకు వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటకు రారని భావిస్తున్నారు.

కోడెల అధికారంలో ఉన్న సమయంలో నరసరావుపేట పరిసర ప్రాంతాలను ఆయన, ఆయన కోడుకు, కూతురు సొంత సామ్రాజ్యంలాగా ఏలేశారు. అక్కడి అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకుని కోడెల టాక్స్‌ పేరుతో జనాలనుంచి డబ్బులను పిండేశారు. ఒక్క డబ్బులే కాదు చివరకు ఫంక్షన్‌లకు చికెన్‌ సప్లై చేయడానికి కూడా వాటాలు వేశారు.

అయితే కోడెల అధికారంలో ఉన్నంత కాలం ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వాటిని స్వీకరించకపోవడం వల్ల ఇంతవరకూ వాళ్ళ మాటకు ఎదురులేకుండా పోయింది.

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కోడెల బాధితులు, వాళ్ళ పిల్లల బాధితులు, కోడెల టాక్స్‌ బాధితులు ఒక్కొక్కళ్ళూ బయటకు వచ్చి ధైర్యంగా కేసులు పెడుతున్నారు. ఇంకా బయటకు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారని అంటున్నారు.

కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి పై మూడు కేసులు నమోదయ్యాయి. బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం, బెదిరించడం, కులం పేరుతో తిట్టడం, చీటింగ్ తదితర కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో వాళ్ళను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో…. వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని తెలుస్తోంది.

First Published:  13 Jun 2019 1:57 AM GMT
Next Story