Telugu Global
NEWS

క్రీడా ధనవంతుల జాబితాలో భారత ఒకే ఒక్కడు

100 వ ర్యాంకులో విరాట్ కొహ్లీ ఏడాదికి 200 కోట్ల రూపాయల సంపాదనతో కొహ్లీ అత్యధిక సంపాదనపరుడుగా లయనల్ మెస్సీ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ..క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…ఆర్జన లోనూ దూసుకుపోతున్నాడు. సంపాదనలో ప్రపంచ ప్రముఖ క్రీడాకారుల మొదటి వందమంది జాబితాలో …వరుసగా మూడో ఏడాది సైతం తన స్థానాన్ని నిలుపుకొన్నాడు. 2017లో 89, 2018 సీజన్లో 83వ స్థానాలలో నిలిచిన కొహ్లీ.. 2019 సీజన్లో మాత్రం…సంపాదన బాగా పెరిగినా…ర్యాంకుల పరంగా 100వ స్థానానికి […]

క్రీడా ధనవంతుల జాబితాలో భారత ఒకే ఒక్కడు
X
  • 100 వ ర్యాంకులో విరాట్ కొహ్లీ
  • ఏడాదికి 200 కోట్ల రూపాయల సంపాదనతో కొహ్లీ
  • అత్యధిక సంపాదనపరుడుగా లయనల్ మెస్సీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ..క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…ఆర్జన లోనూ దూసుకుపోతున్నాడు. సంపాదనలో ప్రపంచ ప్రముఖ క్రీడాకారుల మొదటి వందమంది జాబితాలో …వరుసగా మూడో ఏడాది సైతం తన స్థానాన్ని నిలుపుకొన్నాడు.

2017లో 89, 2018 సీజన్లో 83వ స్థానాలలో నిలిచిన కొహ్లీ.. 2019 సీజన్లో మాత్రం…సంపాదన బాగా పెరిగినా…ర్యాంకుల పరంగా 100వ స్థానానికి పడిపోయాడు.

100వ ర్యాంకులో కొహ్లీ…

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు….. సంపాదనలోనూ చెలరేగిపోతున్నాడు. ఫోర్బెస్ సంస్థ తాజాగా ప్రకటించిన… ప్రపంచంలోనే మొదటి వందమంది సంపాదన పరుల జాబితాలో విరాట్ కొహ్లీ వరుసగా మూడో ఏడాది సైతం తన స్థానాన్ని నిలుపుకొన్నాడు.

25మిలియన్ డాలర్ల ఆర్జనతో కొహ్లీ…

2018 జూన్ నుంచి 2019 జూన్ వరకూ గల 12 నెలల కాలం సంపాదనలో 100వ ర్యాంక్ లో నిలిచిన విరాట్ కొహ్లీ….ఫోర్బ్స్ మ్యాగజీన్..వెలువరించిన క్రీడాకుబేరుల జాబితాలో విరాట్ కొహ్లీ ఏడాదికి 200 కోట్ల రూపాయల ఆర్జనతో చోటు సంపాదించాడు.

విరాట్ కొహ్లీ మొత్తం సంపాదన 200 కోట్ల రూపాయలలో….టెస్ట్, వన్డే, ఐపీఎల్ మ్యాచ్ ఫీజుల ద్వారా 4 మిలియన్ల డార్లు మాత్రమే ఉండటం విశేషం.

మిగిలిన 21 మిలియన్ డాలర్లు..కేవలం ఎండార్స్ మెంట్ల ద్వారానే కొహ్లీ సంపాదించాడు.

అగ్రస్థానంలో లయనల్ మెస్సీ…

2019 సంవత్సరానికి ఫోర్బ్స్ వెలువరించిన మొత్తం 100 మంది అత్యధిక సంపాదనపరులైన క్రీడాకారుల జాబితాలో…. అర్జెంటీనా సాకర్ దిగ్గజం లయనల్ మెస్సీ 127 మిలియన్ డాలర్ల ఆర్జనతో అగ్రస్థానంలో నిలిచాడు.

రెండోర్యాంక్ లో రొనాల్డో…

పోర్చుగీస్ కమ్ రియల్ మాడ్రిడ్ సూపర్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్ లో ఉన్నాడు.

భారత క్రీడాచరిత్రలో సచిన్, ధోనీ,కొహ్లీ మాత్రమే ఫోర్బ్స్ క్రీడా సంపాదన జాబితాలో చోటు సాధించగలిగారు.

2013 ఫోర్బ్స్ క్రీడాసంపాదన జాబితాలో ధోనీ 13, సచిన్ 51వ ర్యాంకులు సాధించగా… 2010 జాబితాలో సచిన్, ధోనీ, కొహ్లీ ముగ్గురూ చోటు సంపాదించారు.

First Published:  12 Jun 2019 1:13 AM GMT
Next Story