Telugu Global
NEWS

జగన్ నిర్ణయాల వెనుక ఎవరున్నారు?

ముఖ్యమంత్రిగా వారం రోజుల అనుభవం. ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల అనుభవం. మరి ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల వెనుక ఎవరున్నారు అనేదే సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా… ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. గతంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరగలేదు. అది కూడా సమాజంలో అన్ని వర్గాల నుంచి ఎంపిక చేయడం ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. పాలనాపరమైన అనుభవం ఏమాత్రం లేని వై.ఎస్.జగన్మోహన్ […]

జగన్ నిర్ణయాల వెనుక ఎవరున్నారు?
X

ముఖ్యమంత్రిగా వారం రోజుల అనుభవం. ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల అనుభవం. మరి ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల వెనుక ఎవరున్నారు అనేదే సర్వత్రా చర్చ జరుగుతోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా… ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్.

గతంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరగలేదు. అది కూడా సమాజంలో అన్ని వర్గాల నుంచి ఎంపిక చేయడం ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. పాలనాపరమైన అనుభవం ఏమాత్రం లేని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం వెనుక ఎవరున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

అయితే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కీలక నిర్ణయాల వెనుక ఎవరూ లేరని, ఆయన చేసిన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాల నుంచి నేర్చుకున్నదే ఎక్కువగా ఉందని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. సంవత్సరాల తరబడి ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితులు వేరెవరో చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా…. రాయలసీమ జిల్లాల్లోనూ ప్రతి పల్లె గుండెను తాకిన జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ఆంకాక్షలు తెలుసునని సన్నిహితులు చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను కళ్లకు కట్టినట్లుగా చూసిన జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి కూడా ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రుల ఎంపికతో పాటు వారికి కేటాయించే శాఖల తీరుపై కూడా జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణమైన స్పష్టత ఉందని, ఆ వాస్తవాలను అనుసరించే మంత్రివర్గ కూర్పును కూడా చేపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం మంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కాదని, ఆ మంత్రులకు కేటాయించిన శాఖల పనితీరుపై కూడా నిరంతరం సమీక్షలు జరుపుతారని అంటున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికి జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నది ఆయన పాదయాత్ర అనుభవాలేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

First Published:  7 Jun 2019 11:54 PM GMT
Next Story