Telugu Global
NEWS

వాళ్ల సాయానికి థ్యాంక్స్ చెప్పిన జగన్

2014 ఎన్నికల్లో జగన్ ఓటమికి.. టీడీపీ గెలుపునకు మధ్యనున్నది ఒక్కటే.. అదే బలమైన టీడీపీ మీడియా. ఆ పచ్చమీడియా…. గెలవాల్సిన జగన్ ను ఓడించింది. మోడీ అధికారంలోకి రాబోతున్నారని.. ఇక్కడ బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపిస్తేనే రాజధాని కూడా లేకుండా విభజించిన ఏపీకి న్యాయం జరుగుతుందని, ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితే మంచి రాజధానిని నిర్మించగలడని మీడియా కోడై కూసింది. దీంతో నమ్మి జనాలు టీడీపీని గెలిపించారు. ఐదేళ్లు గడిచాయి.. ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికలు.. అదే బలమైన […]

వాళ్ల సాయానికి థ్యాంక్స్ చెప్పిన జగన్
X

2014 ఎన్నికల్లో జగన్ ఓటమికి.. టీడీపీ గెలుపునకు మధ్యనున్నది ఒక్కటే.. అదే బలమైన టీడీపీ మీడియా. ఆ పచ్చమీడియా…. గెలవాల్సిన జగన్ ను ఓడించింది. మోడీ అధికారంలోకి రాబోతున్నారని.. ఇక్కడ బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపిస్తేనే రాజధాని కూడా లేకుండా విభజించిన ఏపీకి న్యాయం జరుగుతుందని, ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితే మంచి రాజధానిని నిర్మించగలడని మీడియా కోడై కూసింది. దీంతో నమ్మి జనాలు టీడీపీని గెలిపించారు.

ఐదేళ్లు గడిచాయి.. ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికలు.. అదే బలమైన పచ్చమీడియాను తట్టుకొని జగన్ గెలిచారు. అపూర్వ విజయం సాధించారు. జగన్ గెలుపులో పచ్చ మీడియా పిచ్చి రాతలను తలదన్నేలా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ టీడీపీ అసమర్థతను ఎండగడుతూ వైసీపీ అపూర్వ విజయంలో భాగస్వామి అయ్యారు.

ఇప్పుడు తమ గెలుపునకు కారణమైన వైసీపీ సోషల్ మీడియాకు, నెటిజన్లకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ట్విట్టర్ లో సీఎం జగన్ తన పార్టీ కోసం పనిచేసిన నెటిజన్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎల్లోమీడియా వార్తలు ప్రజల్లోకి వెళ్లకుండా సోషల్ మీడియా అడ్డుకట్ట వేసిందని జగన్ అన్నారు.

తాను పడ్డ కష్టానికి సోషల్ మీడియా అండగా నిలిచిందని జగన్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతీ నెటిజన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. మీ సపోర్టు ఇక ముందు కూడా తనకు ఇలాగే కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు.

First Published:  6 Jun 2019 4:56 AM GMT
Next Story