Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ పెళ్లిచూపులు

టైటిల్ కాస్త తేడాగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం దాదాపు ఇదే. అవును.. మరోసారి పెళ్లికాని ప్రసాద్ పాత్రలోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు వెంకటేశ్. ఈసారి దర్శకుడు ఎవరో తెలుసా? పెళ్లిచూపులు సినిమాను తీసిన తరుణ్ భాస్కర్. ప్రస్తుతం చర్చలు తుదిదశలో ఉన్నాయి. రేపోమాపో సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తారు. వెంకీ-తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా ఉంటుందనే విషయాన్ని స్వయంగా నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు.. తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ […]

వెంకటేష్ పెళ్లిచూపులు
X

టైటిల్ కాస్త తేడాగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ మాత్రం దాదాపు ఇదే. అవును.. మరోసారి పెళ్లికాని ప్రసాద్ పాత్రలోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు వెంకటేశ్. ఈసారి దర్శకుడు ఎవరో తెలుసా? పెళ్లిచూపులు సినిమాను తీసిన తరుణ్ భాస్కర్. ప్రస్తుతం చర్చలు తుదిదశలో ఉన్నాయి. రేపోమాపో సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తారు.

వెంకీ-తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా ఉంటుందనే విషయాన్ని స్వయంగా నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు.. తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుందని ప్రకటించారు. అయితే ఇంకా స్టోరీ లాక్ అవ్వలేదని, వెంకీ-తరుణ్ మధ్య ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిపాడు.

ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ సినిమా తర్వాత లెక్కప్రకారం దిల్ రాజు బ్యానర్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. మరి ఆ సినిమానే సెట్స్ పైకి తీసుకొస్తాడా లేక తరుణ్ భాస్కర్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడా అనేది చూడాలి. రెండు సినిమాలు మాత్రం ఒకేసారి చేయడు. అలా చేయడం వెంకీకి ఇష్టం ఉండదు.

First Published:  6 Jun 2019 5:46 AM GMT
Next Story