ఆ సినిమా నుంచి తప్పుకున్న సన్నీలియోన్
బాలీవుడ్ లో సినిమాలు మరియు ఐటమ్ సాంగ్ లతో బిజీగా ఉన్న సన్నీ లియోని ‘హెలెన్’ అనే సినిమాలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. సౌరభ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోని ఒక లాయర్ పాత్ర పోషించబోతోంది. స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడో మూడేళ్ల క్రితమే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్నీలియోని ఈ చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం […]
బాలీవుడ్ లో సినిమాలు మరియు ఐటమ్ సాంగ్ లతో బిజీగా ఉన్న సన్నీ లియోని ‘హెలెన్’ అనే సినిమాలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. సౌరభ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోని ఒక లాయర్ పాత్ర పోషించబోతోంది.
స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడో మూడేళ్ల క్రితమే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్నీలియోని ఈ చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం చేసింది.
“మూడేళ్ల క్రితమే ఆ సినిమా ఆగిపోయింది. నేను నిర్మాతలకు ఇచ్చిన గడువు సంవత్సరం మాత్రమే. అది దాటి పోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆ సినిమాలో నటించడం లేదు” అని క్లారిటీ ఇచ్చింది సన్నీ లియోన్.
మరోవైపు సన్నీ లియోన్ ఒక మలయాళం సినిమాకు సైన్ చేసింది. ఒకవైపు సినిమాలే కాకుండా మరో వైపు తన కాస్మెటిక్ బ్రాండ్ అభివృద్ధి పై కూడా దృష్టి పెడుతుంది సన్నీ లియోన్. మరోవైపు ఈమె హిందీ లో కొన్ని టీవీ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.