Telugu Global
NEWS

బోయపాటి టీమ్‌కు... కత్తి మహేష్‌ వార్నింగ్‌

మొన్నటి ఎన్నికల వేళ టీడీపీని గెలిపించడానికి టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శీను రూపొందించిన ప్రచార ప్రకటనలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఫేవర్ గా రూపొందిన ఆ యాడ్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు బోయపాటి. అయితే టీడీపీ ఓటమితో ఇప్పుడు ఈయన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అయితే హైదరాబాద్ నుంచి బహిష్కరణ నిర్ణయం తర్వాత కాస్త వెనక్కి తగ్గిన రచయిత కత్తి మహేష్ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా […]

బోయపాటి టీమ్‌కు... కత్తి మహేష్‌ వార్నింగ్‌
X

మొన్నటి ఎన్నికల వేళ టీడీపీని గెలిపించడానికి టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శీను రూపొందించిన ప్రచార ప్రకటనలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఫేవర్ గా రూపొందిన ఆ యాడ్స్ ను అద్భుతంగా డిజైన్ చేశాడు బోయపాటి.

అయితే టీడీపీ ఓటమితో ఇప్పుడు ఈయన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

అయితే హైదరాబాద్ నుంచి బహిష్కరణ నిర్ణయం తర్వాత కాస్త వెనక్కి తగ్గిన రచయిత కత్తి మహేష్ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా పదును పెంచాడు.

తాజాగా తనను ట్రోల్ చేస్తున్న బోయపాటి సోషల్ మీడియా టీంను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశాడు. బోయపాటి టీంలోని కొందరు, టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న తనను అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్నారని.. పద్ధతి మార్చుకోకుంటే సైబరాబాద్ పోలీసుల చేతిలో జైలు పాలు కావడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఒకడు అరెస్ట్ అయ్యాడని.. 47మంది లిస్టులో ఉన్నారని పోస్టు పెట్టాడు.

ఈమధ్య కత్తి మహేష్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలతో పవన్ తోపాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేసిన కత్తి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో అగ్రెసివ్ పోస్టులతో హీట్ పుట్టిస్తున్నాడు. తాజాగా బోయపాటి టీంపై ఆయన చేసిన విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి. మున్ముందు మరి ఎలాంటి ఆరోపణలు చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.

First Published:  6 Jun 2019 3:55 AM GMT
Next Story