Telugu Global
Cinema & Entertainment

మొన్న మహేష్ తో.... ఇప్పుడు రవితేజతో....

కామెడీ సినిమాల తో మన ముందుకు వచ్చి దాదాపుగా యాభైకి పైగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం ఒక విజయవంతమైన సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక వైపు సోలో గా సినిమాలు చేస్తూనే మరో వైపు పెద్ద సినిమాల్లో మంచి పాత్రలని కూడా చేస్తూ వెళ్తున్నాడు. ఇటీవలే మహర్షి లో ఒక కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించిన నరేష్ ఇప్పుడు మరొక పెద్ద సినిమా లో నటించనున్నాడు అని టాక్. త్వరలో రవి […]

మొన్న మహేష్ తో.... ఇప్పుడు రవితేజతో....
X

కామెడీ సినిమాల తో మన ముందుకు వచ్చి దాదాపుగా యాభైకి పైగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం ఒక విజయవంతమైన సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు.

ఒక వైపు సోలో గా సినిమాలు చేస్తూనే మరో వైపు పెద్ద సినిమాల్లో మంచి పాత్రలని కూడా చేస్తూ వెళ్తున్నాడు. ఇటీవలే మహర్షి లో ఒక కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించిన నరేష్ ఇప్పుడు మరొక పెద్ద సినిమా లో నటించనున్నాడు అని టాక్.

త్వరలో రవి తేజ ప్రధాన పాత్ర లో రానున్న డిస్కో రాజా అనే చిత్రం లో నరేష్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. మహర్షి లో నరేష్ పాత్ర నచ్చి మేకర్స్ నరేష్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తుంది.

సైన్స్ ఫిక్షన్ సినిమా గా దర్శకులు ఈ సినిమా ని మన ముందుకు తేనున్నారు. అయితే ఈ సినిమా లో ముందుగా ఈ పాత్ర ని సునీల్ తో చేయించాలి అనుకున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు నరేష్ ని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది.

అయితే ఇదే విషయం పై ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మాత. పాయల్ రాజ్ పుట్ ఈ సినిమా హీరోయిన్. నాభ నటేష్ కూడా ఈ సినిమా లో నటిస్తుంది.

First Published:  6 Jun 2019 1:00 AM GMT
Next Story