Telugu Global
Cinema & Entertainment

సమంత పాత్ర లో శ్రద్ధా కపూర్ ?

తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. పెళ్ళి తర్వాత కూడా టాప్ సక్సెస్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే సమంత త్వరలో ఓ బేబీ అనే సినిమా తో రాబోతుంది. ఈ సినిమా విజయం సమంత కి కీలకం. యు టర్న్ తర్వాత మళ్ళీ ఒక రీమేక్ చిత్రం తో సమంత మన ముందుకు వస్తుంది. ఈ సారి కొరియన్ సినిమా మిస్ గ్రానీ చిత్రాన్ని తెలుగు […]

సమంత పాత్ర లో శ్రద్ధా కపూర్ ?
X

తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. పెళ్ళి తర్వాత కూడా టాప్ సక్సెస్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుంది ఈ భామ.

అయితే సమంత త్వరలో ఓ బేబీ అనే సినిమా తో రాబోతుంది. ఈ సినిమా విజయం సమంత కి కీలకం. యు టర్న్ తర్వాత మళ్ళీ ఒక రీమేక్ చిత్రం తో సమంత మన ముందుకు వస్తుంది.

ఈ సారి కొరియన్ సినిమా మిస్ గ్రానీ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తుంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్,సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్ మరియు నాగ శౌర్య నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా ని హిందీ లో కూడా రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా హిందీ రీమేక్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపొయింది. ఈ హిందీ రీమేక్ లో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. సురేష్ బాబు, సునీత తాటి, విశ్వా ప్రసాద్ ఈ సినిమా ని తెలుగు లో నిర్మించారు. హిందీ లో కూడా వీళ్ళే ప్రొడ్యూసర్స్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు అన్నాయి.

First Published:  5 Jun 2019 4:24 AM GMT
Next Story