Telugu Global
Others

5 జి శకంలో వైరుధ్యాలు

అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక ఏకీకరణ 40 ఏళ్లుగా కొనసాగుతున్నా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పొడసూపుతున్నాయి. సంయమం పాటించడానికి ఏ మాత్రం మొగ్గు చూపడం లేదు. రెండు దేశాల నాయకులు వస్తువులు, పెట్టుబడులు, ప్రజలు, సాంకేతికత మొదలైన విషయాల్లో ఏకీకరణ ఉండకూడదంటున్నాయి. వస్తువుల విషయంలో ఏకీకరణ లేకపోతే వస్తువుల సరఫరాకు విఘాతం కల్గుతుంది. కీలకమైన సాంకేతిక అభివృద్ధి కుంటువడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధిస్తే వివిధ దేశాలమధ్య పెట్టుబడులకు […]

5 జి శకంలో వైరుధ్యాలు
X

అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక ఏకీకరణ 40 ఏళ్లుగా కొనసాగుతున్నా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పొడసూపుతున్నాయి. సంయమం పాటించడానికి ఏ మాత్రం మొగ్గు చూపడం లేదు. రెండు దేశాల నాయకులు వస్తువులు, పెట్టుబడులు, ప్రజలు, సాంకేతికత మొదలైన విషయాల్లో ఏకీకరణ ఉండకూడదంటున్నాయి.

వస్తువుల విషయంలో ఏకీకరణ లేకపోతే వస్తువుల సరఫరాకు విఘాతం కల్గుతుంది. కీలకమైన సాంకేతిక అభివృద్ధి కుంటువడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధిస్తే వివిధ దేశాలమధ్య పెట్టుబడులకు అవకాశం లేకుండా పోతుంది.

ప్రజల మధ్య ఏకీకరణ లేకుండా చేయడానికి అమెరికా విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న చైనా యువకులకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. దీనివల్ల వినూత్నతకు అవకాశం ఉండదు. సాంకేతిక విషయంలో ఏకీకరణకు అడ్డుతగులుతున్నందువల్ల ఇటీవల చైనాలోని భారీ టెలీకాం కంపెనీ హువావీకి అమెరికాలో ప్రవేశం లేకుండా చేశారు.

ఈ కంపెనీ 1987 నుంచి హాంగ్ కాంగ్ నుంచి టెలీఫోన్ స్విచ్చింగ్ గేర్లు దిగుమతి చేసుకుని సరఫరా చేసేది. ఇప్పుడు హువావి సంస్థ ప్రపంచమంతటా మొబైల్ ఫోన్ల కోసం నోకియా, ఎరిక్సన్ లాగా ఉన్నత సాంకేతిక నెట్వర్క్ కిట్లు సరఫరా చేయగల దేశంగా ఎదిగింది. కానీ ఈ సంస్థ 5జి నెట్వర్క్ కు ప్రమాణాలు నిర్దేశించే స్థాయిలో ఉంది. చైనా ఒక్కటే 2025 నాటికి మొత్తం 5జి కనెక్షన్లలో 33 శాతం సరఫరా చేయగలిగే స్థితిలో ఉంటుంది.

అమెరికా, యూరప్ దేశాలను కలిపినా ఈ సామర్థ్యం 25 శాతమే ఉంటుంది. దీని పర్యవసానం ఏమిటి? చైనా, హువావీ టెక్నాలజీలు కలిపి 2018లో మొత్తం సాంకేతిక టెక్నాలజీ పేటెంట్లు 53, 345 ఉంటే అందులో 10 శాతం సంపాదించాయి. అంటే భవిష్యత్తు సాంకేతికత చైనాదేనని ప్రపంచ దేశాలు గుర్తించాయన్న మాట.

డెలాయిట్ కంపెనీ లెక్కల ప్రకారం 2015 నుంచి 2018 మధ్య చైనా అమెరికా సెల్ సైట్ల కన్నా 12 రెట్లు ఎక్కువ ఏర్పాటు చేసింది. 5జి సాంకేతికత కోసం 24 బిలియన్ డాలర్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. 5జి సాంకేతికత ముందున్న సాంకేతికత కన్నా ఎక్కువ సమాచారాన్ని పంపించడానికి తోడ్పడుతుంది.

ఇంతకు ముందున్న సాంకేతిక పరిజ్ఞానంకన్నా 5జి సమర్థవంతమైంది. ఎక్కువ సమాచారాన్ని అనేక పరికరాలకు భారీ స్థాయిలో అందించగలుగుతుంది. గుప్తత కూడా ఎక్కువే. అయితే ఈ గుప్తత కాపాడడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఉదాహరణకు హైబర్నియా ఎక్స్ ప్రెస్ అట్లాంటిక్ మహా సముద్రంలో లండన్ ను, న్యూ యార్క్ ను కలుపుతూ 3,000 మైళ్ల మేర ఫైబర్ ఆప్టిక్ ఏర్పాటు చేసింది. 2011లో హువావీ హైబర్నియా ఎక్స్ ప్రెస్ తో కలిసి ఫైబర్ ఆప్టిక ఏర్పాటు చేయడం ప్రారంభించింది. దీనికి 400 మిలియన్ డాలర్లు ఖర్చయింది.

అంటే ఒక్కో మిల్లీ సెకెండ్ ఆదా చేయడానికి 80 మిలియన్ డాలర్లు ఖర్చయింది. ఇంతకు మునుపటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం, 5జి తో సహా మొదట్లో ఈ ఏర్పాట్లు చేయడానికి పెట్టుబడి విపరీతంగా అవసరమయ్యేది. అయితే 5జి ఎక్కువ రాబడికి దోహదం చేస్తుంది. సైబర్ సేవలను విస్తృత పరచడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. దీనిలో ఎంత పెట్టుబడి వెనక్కు వస్తుందో తెలియదు.

గత దశాబ్దంలో 4జి అమలులోకి వచ్చినప్పుడు నెట్వర్క్ లో చాలా మదుపు పెట్టవలసి వచ్చింది. ముఖ్యంగా అమెరికాలో అధిక పెట్టుబడి అవసరమైంది. ఎందుకంటే మొదట్లో అక్కడే 4జి నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ధరల విషయంలో పోటీవల్ల పెట్టుబడిలో ఎంత గిట్టుబాటు అవుతుందో తెలియదు.

ఇలాంటి పరిస్థితిలో నెట్వర్కింగ్ లో ఇతరులతో భాగస్వామ్యంవల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. కానీ అమెరికా తదితర దేశాలకు ఈ విషయంలో అనుమానాలున్నాయి. రాబడి తగ్గిపోతున్నందువల్ల ఆసియా దేశాలు లాఘవం ప్రదర్శిస్తున్నందువల్ల ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈ దేశాలు తక్కువ ధరకు నెట్వర్క్ అభివృద్ధి చేసి పోటీని నిలదొక్కుకుంటున్నాయనిపిస్తోంది.

ఆర్థికంగా నాయకత్వం వహించే స్థాయిలో ఉండాలంటే విలువ పెంచడంతో పాటు సమాచారాన్ని నూతన మార్గాల్లో వినియోగించగలగాలి కనక చైనా 5జి నెట్వర్క్ సాంద్రత – అంటే ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు 5.3 సైట్లు లేదా ప్రతి పది వేలమందికి 14.1 సైట్ ఉన్నప్పుడు అమెరికాలో ప్రతి పది వేలమందికి 4.7 సైట్లు మాత్రమే ఉన్నందువల్ల అమెరికా ఆందోళన పడడంలో ఆశ్చర్యం లేదు.

నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో ఘర్షణ ప్రక్రియను కొనసాగించడం ద్వారా అమెరికా దాని మిత్ర దేశాలు డిజిటల్ వ్యవహారాల్లో రాజ్యం పాత్రకు చోటు కల్పించాలని అనుకుంటున్నాయి. దీనికి తోడు ధర విషయంలో పోటీ ఎదుర్కోవడానికి సబ్సిడీలు ఇస్తున్నారు.

డిజిటల్ వ్యవహారాల్లో రాజ్యం పాత్ర ఉంటే నిఘా విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల సైద్ధాంతిక సంక్షోభం కూడా తొలగిపోవచ్చు. ఈ స్థితిలో చైనా సైబర్ రంగంలో సార్వభౌమాధికారం కావాలనుకుంటోంది. సరిహద్దుకు ఆవల సమాచార పంపిణీలో నియంత్రణ కావాలంటోంది. అమెరికా, యూరప్ దేశాలు దొంగచాటుగా చేస్తున్న పని కూడా ఇదే. అందుకే ఇవి దీర్ఘకాలికంగా వైషమ్యాలు ఉన్న దేశాలా? లేక పోటీ పడుతున్న దేశాలా?

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story