Telugu Global
NEWS

ఏ తప్పూ చేయనప్పుడు.... ఎందుకు తప్పించుకు తిరిగారు?

ప్రశ్నలు వేయడం తప్ప సమాధానాలు చెప్పే అలవాటు లేని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ ను ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిరి చేశారు సైబరాబాద్‌ పోలీసులు. మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా… మరి టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈవోగా దానిని కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు. శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఒప్పంద ప్రతాలతో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో కలిసి […]

ఏ తప్పూ చేయనప్పుడు.... ఎందుకు తప్పించుకు తిరిగారు?
X

ప్రశ్నలు వేయడం తప్ప సమాధానాలు చెప్పే అలవాటు లేని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ ను ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిరి చేశారు సైబరాబాద్‌ పోలీసులు.

మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా… మరి టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈవోగా దానిని కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు.

శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఒప్పంద ప్రతాలతో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో కలిసి ఫిర్యాదు చేయించడానికి కారణాలేంటి?

కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు? ఆ సంతకాన్ని ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చింది?

టీవీ9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్తి కదా !…. టీవీని అమ్మాం కానీ…. లోగోను అమ్మలేదంటూ… మీరు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా?

యాజమాన్యానికి తెలియకుండా టీవీ9 నిధులను మీరు దుర్వినియోగం చేశారా? లేదా?

ఎలాంటి తప్పు చేయనప్పుడు నెలరోజులుగా ఎందుకు తప్పించుకుతిరిగారు? లొంగిపోయి వివరణ ఇస్తే సరిపోయేది కదా?…. ఇలా రవిప్రకాష్‌ పై అనేక ప్రశ్నలు సంధించారు పోలీసులు.

First Published:  5 Jun 2019 2:43 AM GMT
Next Story