Telugu Global
Cinema & Entertainment

స్పానిష్ మూవీ రీమేక్ లో.... అనుష్క

గత ఏడాది మొదట్లో ‘భాగమతి’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి… సంవత్సరం పాటు తెలుగు తెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికా లో జరుగుతుంది. ఆర్ మాధవన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా గురించిన […]

స్పానిష్ మూవీ రీమేక్ లో.... అనుష్క
X

గత ఏడాది మొదట్లో ‘భాగమతి’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి… సంవత్సరం పాటు తెలుగు తెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ భామ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికా లో జరుగుతుంది. ఆర్ మాధవన్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే అనుష్క మరి కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసే పనిలో పడింది. తాజాగా అనుష్క ఒక సినిమా రీమేక్ లో నటించేందుకు ఒప్పుకుందట. స్పానిష్ సినిమా ‘జూలియస్ అయిస్’ రీమేక్ లో నటించడానికి అనుష్క సిద్ధమవుతోంది.

ఈ సినిమాకి కబీర్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రివేంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో అనుష్క డ్యూయల్ రోల్ పోషించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  5 Jun 2019 4:22 AM GMT
Next Story