Telugu Global
NEWS

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లం.. కేబినెట్ హోదా..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూకుడు చూపిస్తున్నారు. మంత్రి మండలి ఏర్పడక ముందే పరిపాలనలో తనదైన మార్కును వేస్తున్నారు. ఇప్పటికే 47 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసి సంచలనం సృష్టించిన జగన్.. తనకు అవసరమైన కోర్ టీంను సెలెక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లంను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎంవో లోని కార్యదర్శులకు […]

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లం.. కేబినెట్ హోదా..!
X

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూకుడు చూపిస్తున్నారు. మంత్రి మండలి ఏర్పడక ముందే పరిపాలనలో తనదైన మార్కును వేస్తున్నారు. ఇప్పటికే 47 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసి సంచలనం సృష్టించిన జగన్.. తనకు అవసరమైన కోర్ టీంను సెలెక్ట్ చేసుకుంటున్నారు.

తాజాగా ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లంను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎంవో లోని కార్యదర్శులకు ఆయన నాయకత్వం వహిస్తారంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు ఆయన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. అజేయ్ కల్లం ఆ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.

1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజయ్ కల్లం గతంలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం, నల్గొండ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు ఆయన కలెక్టర్‌గా కూడా పని చేశారు.

First Published:  4 Jun 2019 9:45 PM GMT
Next Story