పెసలు.... ప్రోటీన్స్ గనులు
పెసలు బలమైన ఆహారం. దీనిని మూంగ్ దాల్ అంటారు. పేరు ఏదైతేనేం మనకు కావాల్సింది ఆరోగ్యమే కదా. మాంసాహారులు ప్రొటీన్లకోసం మాంసం తింటే… శాకాహారులు ప్రధానంగా పెసరపప్పు, కందిపప్పు తింటారు. మనకు ప్రధానంగా ప్రొటీన్స్ ను అందించే వాటిలో పెసర ముఖ్యమైనది. ఇది ఆరోగ్యంతో పాటు మీ చర్మ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా కాపాడుతుంది. వీటిని చైనాలో ఎక్కువగా వాడతారు. తెలుగు వారైతే పెసలతో పెసరట్టు వేసుకుని తింటారు. నానబెట్టిన పెసలకు కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా […]
పెసలు బలమైన ఆహారం. దీనిని మూంగ్ దాల్ అంటారు. పేరు ఏదైతేనేం మనకు కావాల్సింది ఆరోగ్యమే కదా. మాంసాహారులు ప్రొటీన్లకోసం మాంసం తింటే… శాకాహారులు ప్రధానంగా పెసరపప్పు, కందిపప్పు తింటారు. మనకు ప్రధానంగా ప్రొటీన్స్ ను అందించే వాటిలో పెసర ముఖ్యమైనది. ఇది ఆరోగ్యంతో పాటు మీ చర్మ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా కాపాడుతుంది. వీటిని చైనాలో ఎక్కువగా వాడతారు.
తెలుగు వారైతే పెసలతో పెసరట్టు వేసుకుని తింటారు. నానబెట్టిన పెసలకు కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా కారం కలుపుకుని పోపు చేసుకుని కూడా తింటారు. మొలకెత్తిన పెసలు ఎంతో ఆరోగ్యం. ఈ పెసలు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో తెలుసుకుందాం.
- రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్దాయిలను అదుపు చేసేందుకు ఉపయోగపడతాయి.
- పెసలలో లేదా పెసరపప్పులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది.
- ఇందులో ఉన్న మాంగీనీస్ రక్తపోటును అదుపుచేస్తుంది.
- పెసలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. అందువల్ల ఇది సులభంగా జీర్ణం అవుతుంది.
- ఇది అద్భుతమైన డైటరీ ఫైబర్. పీచు పదార్దం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది మలబద్దక నివారిణి.
- ఎనీమియా లేదా హిమోగ్లోబిన్ సమస్యలతో బాధపడుతున్న వారికి పెసలలో ఉన్న ఐరన్ ఎనీమియాను దూరంచేసి…. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.
- పెసలతో చేసిన సున్నిపిండి చర్మానికి మృదుత్వాన్ని తెచ్చి… చర్మ సమస్యలను నివారిస్తుంది.
- పెసలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి తొందరగా జీర్ణం అవుతాయి. కాబట్టి గుండెకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండవు.
- తరచూ పెసలు తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
- కండరాలు, ఎముకల నొప్పులను తగ్గించి వాటిని గట్టి పరుస్తుంది.
- హర్మోన్యల్ ఇమ్ బ్యాలన్స్ ను కంట్రోల్ చేస్తుంది.