Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ తో.... పాయల్ రాజ్ పుత్ డ్యాన్స్?

‘ఆర్ ఎక్స్ 100’ వంటి బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అప్పటినుంచి ఈమెకు పెద్దగా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా…. ఐటెం సాంగ్ ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీత’ సినిమా లో ఐటెం సాంగ్ లో కనిపించింది పాయల్ రాజ్ పుత్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈమెకు […]

ప్రభాస్ తో.... పాయల్ రాజ్ పుత్ డ్యాన్స్?
X

‘ఆర్ ఎక్స్ 100’ వంటి బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అప్పటినుంచి ఈమెకు పెద్దగా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా…. ఐటెం సాంగ్ ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయి.

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీత’ సినిమా లో ఐటెం సాంగ్ లో కనిపించింది పాయల్ రాజ్ పుత్.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈమెకు మరొక ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది చిన్న సినిమా కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం చిత్రబృందం ఒక సెట్ ను డిజైన్ చేసిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక పాటలో ప్రభాస్ పక్కన డాన్స్ చేయడం కోసం అడిగినట్లు తెలుస్తోంది. అయితే పాయల్ ఇంకా తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉందట. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల కాబోతోంది.

First Published:  4 Jun 2019 1:36 AM GMT
Next Story