Telugu Global
Cinema & Entertainment

సప్తగిరి సినిమాలో అర్చన

సప్తగిరి…. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకోవడంతో… హీరోగా పెట్టి చాలామంది ప్రొడ్యూసర్స్ అయన మీద డబ్బులు పెట్టడానికి కూడా రెడీ గా ఉన్నారు. అదే విధంగా ఇంతకు ముందు ఆయన సినిమాలు కొన్ని బీసీ సెంటర్ల లో బాగానే ఆడటంతో అదే ఉత్సాహం తో మరో సినిమాతో రాబోతున్నాడు సప్తగిరి. అరుణ్ పవార్ అనే దర్శకుడితో గతంలోనే ఒక సినిమాలో నటించాడు ఈ హీరో. ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరలా ఒక కొత్త సినిమా […]

సప్తగిరి సినిమాలో అర్చన
X

సప్తగిరి…. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకోవడంతో… హీరోగా పెట్టి చాలామంది ప్రొడ్యూసర్స్ అయన మీద డబ్బులు పెట్టడానికి కూడా రెడీ గా ఉన్నారు. అదే విధంగా ఇంతకు ముందు ఆయన సినిమాలు కొన్ని బీసీ సెంటర్ల లో బాగానే ఆడటంతో అదే ఉత్సాహం తో మరో సినిమాతో రాబోతున్నాడు సప్తగిరి.

అరుణ్ పవార్ అనే దర్శకుడితో గతంలోనే ఒక సినిమాలో నటించాడు ఈ హీరో. ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరలా ఒక కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమా పేరు ‘వజ్ర కవచ ధర గోవింద’…. వైభవ్‌ జోషి హీరోయిన్‌ గా నటించింది.

అలాగే ఈ సినిమా లో బిగ్ బాస్ ఫేమ్ అర్చన ఒక కీలక పాత్ర లో మెరవనుంది. నిన్న ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని సినిమా యూనిట్ ఆన్ లైన్ లో విడుదల చేశారు. కథ లో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు కానీ బీ సి ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు మాత్రం ఈజీగా తెలుస్తుంది.

ఒక పక్కా కమర్షియల్ సినిమా గా రెడీ అవుతున్న ఈ సినిమా…. కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం సినిమాల మాదిరి గా ఉండే అవకాశం ఉంది. వరుసగా హీరోగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ కావాల్సిన విజయం మాత్రం సప్తగిరి ని ఇంకా వరించలేదు. అందుకే ఈ సినిమా తో అయినా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

First Published:  4 Jun 2019 3:47 AM GMT
Next Story