Telugu Global
Cinema & Entertainment

'ఎవరు' అంటున్న అడివి శేష్

ఒకవైపు నటుడిగా మరోవైపు స్క్రిప్ట్ రైటర్ గా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు నటుడు అడవిశేష్. ఈ మధ్యనే ‘గూఢచారి’ అనే సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. గత కొంతకాలంగా అడివి శేష్…. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ‘ఎవరు’ అనే టైటిల్ […]

ఎవరు అంటున్న అడివి శేష్
X

ఒకవైపు నటుడిగా మరోవైపు స్క్రిప్ట్ రైటర్ గా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు నటుడు అడవిశేష్. ఈ మధ్యనే ‘గూఢచారి’ అనే సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు.

గత కొంతకాలంగా అడివి శేష్…. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ‘ఎవరు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి…. ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని తెలుస్తోంది.

ఒకవైపు సౌత్ లోనే కాక బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రెజినా కసాండ్రా ఈ మధ్యనే హిందీలో ‘ఏక్ లడికీ కో దేఖా తో ఐసా లాగా’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె అడవి శేష్ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర పోస్టర్ ను చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఈ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కాబోతోంది.

First Published:  3 Jun 2019 3:05 AM GMT
Next Story