Telugu Global
NEWS

ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భారీవిజయాలు

శ్రీలంక కెప్టెన్ దిముత్ కరణరత్నే అరుదైన రికార్డు శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల విజయం అప్ఘనిస్థాన్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల గెలుపు వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్లో…డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. ఆసియాజట్లు శ్రీలంక, అప్ఘనిస్థాన్ జట్లకు మాత్రం పరాజయాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ 10 వికెట్ల విజయం కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో న్యూజిలాండ్ 10 వికెట్లతో మాజీ చాంపియన్ శ్రీలంకను […]

ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భారీవిజయాలు
X
  • శ్రీలంక కెప్టెన్ దిముత్ కరణరత్నే అరుదైన రికార్డు
  • శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల విజయం
  • అప్ఘనిస్థాన్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల గెలుపు

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్లో…డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. ఆసియాజట్లు శ్రీలంక, అప్ఘనిస్థాన్ జట్లకు మాత్రం పరాజయాలు ఎదురయ్యాయి.

న్యూజిలాండ్ 10 వికెట్ల విజయం

కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో న్యూజిలాండ్ 10 వికెట్లతో మాజీ చాంపియన్ శ్రీలంకను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక..29.2 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాత్రమే తుదివరకూ పోరాడి 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 84 బాల్స్ లో 4 బౌండ్రీలతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.

దిముత్ అరుదైన రికార్డు…

ప్రపంచకప్ చరిత్రలోనే ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి తుదివరకూ పోరాడి నాటౌట్ గా నిలిచిన రెండో ఆటగాడిగా శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే రికార్డుల్లో చేరాడు.

1999 ప్రపంచకప్ లో విండీస్ బ్యాట్స్ మన్ రీడ్లే జాకోబ్స్ 49 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా…ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పుడు శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే వచ్చి…జాకోబ్స్ సరసన చేరాడు.

కివీ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ, ల్యూక్ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

కివీ ఓపెనర్ల ధూమ్ ధామ్ బ్యాటింగ్…

50 ఓవర్లలో 137 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యం సాధించింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 73, కోలిన్ మున్రో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

10 వికెట్ల అలవోక విజయం సాధించిన న్యూజిలాండ్ గెలుపులో ప్రధానపాత్ర వహించిన హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కంగారూ బోణీ…

బ్రిస్టల్ వేదికగా జరిగిన మరో తొలిరౌండ్ పోటీలో…డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మరో 91 బాల్స్ మిగిలిఉండగానే 7 వికెట్ల తేడాతో పసికూన అప్ఘనిస్థాన్ పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న అప్ఘనిస్థాన్ 38.2 ఓవర్లలో 207 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కంగారూ బౌలర్లలో స్టార్క్, జంపా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 208 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్- ఆరోన్ ఫించ్ జోడీ మొదటి వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

కెప్టెన్ ఫించ్ 66, వన్ డౌన్ క్వాజా 15, మాజీ కెప్టెన్ స్మిత్ 18 పరుగులకు అవుట్ కాగా…డేవిడ్ వార్నర్ 8 బౌండ్రీలతో 89 పరుగుల స్కోరుతో నాటౌట్ నిలిచాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  2 Jun 2019 7:02 PM GMT
Next Story