Telugu Global
Cinema & Entertainment

సంపాదించడమే కాదు.... ఖర్చు విషయంలోనూ లెక్కలేస్తున్న తాప్సీ

గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సౌత్ బ్యూటీ తాప్సీ పన్ను కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మరియు పర్ఫామెన్స్ కు బాగా స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. ఈ మధ్యనే ‘బద్లా’ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న తాప్సీ కి…. డబ్బులు ఎలా సంపాదించాలి అని మాత్రమే కాక వాటిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా బాగా తెలుసని ఆమె […]

సంపాదించడమే కాదు.... ఖర్చు విషయంలోనూ లెక్కలేస్తున్న తాప్సీ
X

గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సౌత్ బ్యూటీ తాప్సీ పన్ను కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మరియు పర్ఫామెన్స్ కు బాగా స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

ఈ మధ్యనే ‘బద్లా’ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న తాప్సీ కి…. డబ్బులు ఎలా సంపాదించాలి అని మాత్రమే కాక వాటిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా బాగా తెలుసని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ఇప్పటికే తాప్సీ పన్ను ముంబైలో ఒక కాస్ట్లీ ఏరియాలో అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ ను కొనేసింది. ప్రస్తుతం ఈమె అక్కడే ఉంటుంది. తాజాగా అదే లొకాలిటీలో ఒక త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కూడా సేల్ కి పెట్టడంతో ఆమె దానిని కూడా వెంటనే కొనేసిందని తెలుస్తోంది.

అసలే ముంబైలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగానే జోరుగా సాగుతోంది. ఈ సమయంలో తాప్సీ ఫైనాన్షియల్ గా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాల పరంగా చూస్తే తాప్సి త్వరలో ‘గేమ్ ఓవర్’ అనే సినిమాలో కనిపించబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో జూన్ 14న విడుదల కానుంది.

First Published:  1 Jun 2019 11:49 PM GMT
Next Story