Telugu Global
NEWS

ఫ్యామిలీతో బాబు.... ఎట్టకేలకు రిలాక్స్....

ఎన్నాళ్లకెన్నాళ్లకు బాబు రెస్ట్ తీసుకున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడ్డ చంద్రబాబు…. ఎన్నికలు తొలి విడతలోనే ముగిసినా సరైన రెస్ట్ తీసుకోలేదు. మధ్యలో వెకేషన్ కు వెళ్లివచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే కేంద్రంలో హంగ్ వస్తే ఎలా అని.. ఇతర ప్రాంతీయ పార్టీలతో లాబీయింగ్ చేశారు. కర్ణాటక, బెంగాల్ వెళ్లి ఆయా మిత్రపక్షాలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఫలితాలు వచ్చే వరకు ఏపీ సీఎంగా అంతే హడావుడి ప్రదర్శించారు.  కానీ ఇప్పుడు కావాల్సినంత విశ్రాంతి లభించింది. […]

ఫ్యామిలీతో బాబు.... ఎట్టకేలకు రిలాక్స్....
X

ఎన్నాళ్లకెన్నాళ్లకు బాబు రెస్ట్ తీసుకున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కష్టపడ్డ చంద్రబాబు…. ఎన్నికలు తొలి విడతలోనే ముగిసినా సరైన రెస్ట్ తీసుకోలేదు. మధ్యలో వెకేషన్ కు వెళ్లివచ్చాడని వార్తలు వచ్చాయి.

అయితే కేంద్రంలో హంగ్ వస్తే ఎలా అని.. ఇతర ప్రాంతీయ పార్టీలతో లాబీయింగ్ చేశారు. కర్ణాటక, బెంగాల్ వెళ్లి ఆయా మిత్రపక్షాలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఫలితాలు వచ్చే వరకు ఏపీ సీఎంగా అంతే హడావుడి ప్రదర్శించారు.

కానీ ఇప్పుడు కావాల్సినంత విశ్రాంతి లభించింది. చంద్రబాబు కోరుకోకున్నా.. ఆయనకు ఐదేళ్ల సెలవు ఇచ్చారు ప్రజలు. అందుకే ఈ ఖాళీ టైంలో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 30నే ఏర్పడింది. ఎంతలేదన్నా జగన్ కు 6 నెలల సమయం ఇవ్వడం సముచితమని బాబు ప్రకటించారు. అందుకే ఈ ఆరు నెలలు చంద్రబాబు రిలాక్స్ అవ్వడానికే ప్రయత్నిస్తారు.

తాజాగా చంద్రబాబు వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. వారం పాటు కుటుంబ సమేతంగా చంద్రబాబు విదేశాలకు వెళుతున్నారు. ఈ నెల 7 నుంచి చంద్రబాబు వారం రోజుల పాటు విదేశాల్లో గడుపనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న తిరిగి విజయవాడకు వస్తారని తెలిపారు.

ఇలా చంద్రబాబు ఎన్నికలు ముగిసినా విశ్రాంతి లేకుండా ఇన్నాళ్లు పనిచేశాడు. ఇప్పుడైనా కాస్త రిలాక్స్ అవుతున్నారు. అవ్వక తప్పని పరిస్థితి. అందుకే కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతున్నారు.

First Published:  2 Jun 2019 3:45 AM GMT
Next Story