Telugu Global
Cinema & Entertainment

ఎన్జీకే ఫ్లాప్.... సూర్య కొత్త సినిమా ఆగిపోయింది?

నిన్న ప్రపంచ వ్యాప్తం గా తెలుగు లో మరియు తమిళం లో ఒకేసారి విడుదల అయిన చిత్రం ఎన్జీకే. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సాయి పల్లవి ఈ చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ సినిమా కి అనుకున్నంత ఆదరణ రాలేదు సరి కదా, సినిమా లో సూర్య నటన తప్ప మెప్పించే అంశాలు ఏమి లేవు అని […]

ఎన్జీకే ఫ్లాప్.... సూర్య కొత్త సినిమా ఆగిపోయింది?
X

నిన్న ప్రపంచ వ్యాప్తం గా తెలుగు లో మరియు తమిళం లో ఒకేసారి విడుదల అయిన చిత్రం ఎన్జీకే. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సాయి పల్లవి ఈ చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించారు.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఈ సినిమా కి అనుకున్నంత ఆదరణ రాలేదు సరి కదా, సినిమా లో సూర్య నటన తప్ప మెప్పించే అంశాలు ఏమి లేవు అని అందరూ తేల్చి పారేశారు.

ఇదిలా ఉంటె ప్రస్తుతం చెన్నై ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సూర్య తో సినిమా చేయాలి అనుకున్న దర్శకుడు శివ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది.

తమిళం లో ఇటీవల కాలం లో మంచి విజయం సాధించి అందరి ఆదరణ పొందిన మాస్ దర్శకుడు శివ. సూర్య తో సినిమా చేస్తున్నాడు అనే ప్రకటన కూడా ఇటీవల వచ్చింది. అయితే ఇప్పుడు అది కుదరడం లేదు అని టాక్. శివకి ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమా ఆఫర్ చేశారట. అందుకని ఆ సినిమా చేయడం బెస్ట్ అని అనుకున్న శివ ఇప్పుడు సూర్య తో సినిమా కాన్సిల్ చేసుకున్నారు అని టాక్.

First Published:  1 Jun 2019 12:45 AM GMT
Next Story