Telugu Global
Cinema & Entertainment

సమంత నుంచి మరో సినిమా వచ్చేస్తోంది

ఈ సమ్మర్ లో మజిలీతో అందర్నీ ఆకట్టుకున్న సమంత, ఈసారి ‘హే బేబీ’ అంటూ మరోసారి అందర్నీ పలకరించబోతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా పేరు “హే బేబీ”. నందినీరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై 5న ఈ సినిమా రాబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందు ‘హే బేబీ’ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటు విడుదల తేదీని ప్రకటించారు. ఈ […]

సమంత నుంచి మరో సినిమా వచ్చేస్తోంది
X

ఈ సమ్మర్ లో మజిలీతో అందర్నీ ఆకట్టుకున్న సమంత, ఈసారి ‘హే బేబీ’ అంటూ మరోసారి అందర్నీ పలకరించబోతోంది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా పేరు “హే బేబీ”. నందినీరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై 5న ఈ సినిమా రాబోతున్నట్టు ప్రకటించారు.

అంతకంటే ముందు ‘హే బేబీ’ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటు విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ బాణీలు అందించాడు. నాగశౌర్య హీరోగా నటించాడు కానీ సినిమా మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుంది. కొరియాలో హిట్ అయిన మిస్ గ్రానీ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ ఇది. అందుకే పోస్టర్లలో ఒరిజినల్ మేకర్స్ పేర్లు కూడా కనిపిస్తాయి.

నాగశౌర్య, లక్ష్మి, రావురమేష్, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ డైరక్టర్ నందినీరెడ్డికి చాలా కీలకం. చాన్నాళ్ల తర్వాత దర్శకత్వం వహించే అవకాశం అందుకున్న ఈమెకు, ఈ సినిమా ఫ్లాప్ అయితే ఛాన్సులు రావడం కష్టం.

First Published:  1 Jun 2019 7:23 AM GMT
Next Story