Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న నాచురల్ స్టార్

‘బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేని డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరువాత మహేష్…. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మా అతి తక్కువ కలెక్షన్లను నమోదు చేసుకున్న సినిమాగా మిగిలిపోయింది. ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకి రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రీకాంత్ అడ్డాల తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ […]

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న నాచురల్ స్టార్
X

‘బ్రహ్మోత్సవం’ సినిమా మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేని డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరువాత మహేష్…. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మా అతి తక్కువ కలెక్షన్లను నమోదు చేసుకున్న సినిమాగా మిగిలిపోయింది.

‘బ్రహ్మోత్సవం’ దెబ్బకి రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న శ్రీకాంత్ అడ్డాల తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ శ్రీకాంత్ అడ్డాలతో ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరో గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటికి వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కథ కూడా బాగానే ఉందని, పైగా గీతా ఆర్ట్స్ సంస్థ నాని సూపర్ హిట్ సినిమా ‘భలే భలే మగాడివోయ్’ నిర్మించడం వలన ఈ సినిమా చేయడానికి నాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సమాచారం. ‘శతమానం భవతి’ సినిమా లాగా ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో అయినా శ్రీకాంత్ అడ్డాల హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

First Published:  1 Jun 2019 12:31 AM GMT
Next Story