Telugu Global
Cinema & Entertainment

హిరణ్యకశిప ప్రాజెక్టు సెట్ అయింది

ఇప్పుడు కాదు, దాదాపు మూడేళ్లుగా నలుగుతోంది హిరణ్యకశిప సినిమా. బాహుబలి పార్ట్-1 హిట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. రానాను హీరోగా పెట్టి ఈ మైథలాజికల్ సినిమా చేస్తానని తనకుతానుగా ప్రకటించుకున్నాడు. కానీ సురేష్ బాబుతో వ్యవహారం అంటే మాములుగా ఉండదు. అలా గుణశేఖర్ ప్రకటించిన తర్వాత ఈ సినిమా ఓకే అవ్వడానికి ఇన్నాళ్లు పట్టింది. ఎట్టకేలకు సురేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో హిరణ్యకశిప ప్రాజెక్టు ఫైనలైజ్ అయినట్టు […]

హిరణ్యకశిప ప్రాజెక్టు సెట్ అయింది
X

ఇప్పుడు కాదు, దాదాపు మూడేళ్లుగా నలుగుతోంది హిరణ్యకశిప సినిమా. బాహుబలి పార్ట్-1 హిట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. రానాను హీరోగా పెట్టి ఈ మైథలాజికల్ సినిమా చేస్తానని తనకుతానుగా ప్రకటించుకున్నాడు. కానీ సురేష్ బాబుతో వ్యవహారం అంటే మాములుగా ఉండదు. అలా గుణశేఖర్ ప్రకటించిన తర్వాత ఈ సినిమా ఓకే అవ్వడానికి ఇన్నాళ్లు పట్టింది. ఎట్టకేలకు సురేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో హిరణ్యకశిప ప్రాజెక్టు ఫైనలైజ్ అయినట్టు గుణశేఖర్ స్వయంగా ప్రకటించాడు.

పురాణాలకు చెందిన టైటిల్ పెట్టి, లోపల ఇంకేదో చూపించడం ఈమధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఈమధ్య వచ్చిన సీత సినిమా కూడా అలాంటిదే. కానీ హిరణ్యకశిప మాత్రం అలాంటి సినిమా కాదు. పురాణాల్లో మనం చదువుకున్న అంశానికే కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో అంతే స్థాయిలో గ్రాఫిక్స్ కూడా వాడబోతున్నారు.

సినిమాకు సంబంధించి మూడేళ్లుగా జరుగుతున్న ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు ప్రకటించాడు గుణశేఖర్. ఇక కొబ్బరికాయ కొట్టి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. అయితే దీనికి ఇంకా సురేష్ బాబు డేట్ సెట్ చేయలేదు. అందుకే గుణశేఖర్ ప్రకటించలేదు. త్వరలోనే ముహూర్తం డేట్ తో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు బయటకొస్తాయి.

First Published:  1 Jun 2019 7:18 AM GMT
Next Story