Telugu Global
NEWS

ఫ్రెంచ్ ఓపెన్లో నవోమీ ఒసాకా గ్రేట్ ఎస్కేప్

రెండోరౌండ్లో ఓటమి అంచుల నుంచి గెలుపు మూడోరౌండ్లో జ్వేరేవ్, సెరెనా, జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో… టాప్ సీడ్ నవోమీ ఒసాకా ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా నిలిచింది. మారథాన్ సమరంలో మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెంకాను అధిగమించి మూడోరౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది. నువ్వానేనా అన్నట్లుగా …మూడుగంటలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో టాప్ స్టార్ నవోమీ 4-6, 7-5, 6-3తో విజేతగా నిలిచింది. తొలిసెట్ ను విక్టోరియా 6-4తో […]

ఫ్రెంచ్ ఓపెన్లో నవోమీ ఒసాకా గ్రేట్ ఎస్కేప్
X
  • రెండోరౌండ్లో ఓటమి అంచుల నుంచి గెలుపు
  • మూడోరౌండ్లో జ్వేరేవ్, సెరెనా, జోకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో… టాప్ సీడ్ నవోమీ ఒసాకా ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా నిలిచింది.
మారథాన్ సమరంలో మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెంకాను అధిగమించి మూడోరౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది.

నువ్వానేనా అన్నట్లుగా …మూడుగంటలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో టాప్ స్టార్ నవోమీ 4-6, 7-5, 6-3తో విజేతగా నిలిచింది.

తొలిసెట్ ను విక్టోరియా 6-4తో నెగ్గడం ద్వారా మ్యాచ్ పై పట్టు బిగించింది. అయితే టాప్ సీడ్ నవోమీ మాత్రం తన పవర్ టెన్నిస్ తో… రెండో సెట్ ను 7-5తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచింది. నిర్ణయాత్మక ఆఖరి సెట్ ను 6-3తో సొంతం చేసుకోడం ద్వారా నవోమీ మూడోరౌండ్లో అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్ లో నెగ్గడం ఎనలేని సంతృప్తినిచ్చిందని…. శారీరంగా, మానసికంగా అలసిపోయేలా చేసిందని విజయానంతరం నవోమీ చెప్పింది.

మూడోరౌండ్లో సెరెనా విలియమ్స్…

మహిళల సింగిల్స్ మరో రెండోరౌండ్ పోటీలో… అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్… 6-3, 6-2తో జపాన్ ప్లేయర్ కురుమీ నారాను చిత్తు చేసింది.

గట్టెక్కిన జ్వేరేవ్….

పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, 5వ సీడ్ జ్వెరేవ్, డోమినిక్ థైమ్ సైతం విజయాలు సాధించారు.

రెండోరౌండ్లో జోకోవిచ్ మూడుసెట్ల పోరులో స్వీడన్ ఆటగాడు హెన్రీ లాక్సోనెన్ ను ఓడించాడు. జోకో 6-1, 6-4, 6-3తో విజేతగా నిలిచాడు. ఐదోసీడ్ జ్వెరేవ్ 6-1, 6-3, 7-6తో మైకేల్ గోమెర్ ను ఇంటిదారి పట్టించాడు.

బెల్జియం ఆటగాడు డోమినిక్ థైమ్…. 6-3, 6-7, 6-3, 7-5తో కజక్ ఆటగాడు అలెగ్జాండర్ బుబ్లిక్ ను అధిగమించాడు.

మొత్తం మీద… పురుషుల, మహిళల సింగిల్స్ మూడోరౌండ్ కు సీడెడ్ స్టార్లు చేరుకోగలిగారు.

First Published:  30 May 2019 11:28 PM GMT
Next Story