ప్రొటీన్లు.... ఆరోగ్య కారకాలు....
పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటిన్స్ ఇవ్వండి అని డాక్టర్లు చెబుతారు. అలాగే శరీరంలో కొంచెం సత్తువ తగ్గినా కూడా మంచి ప్రొటీన్ ఫుడ్ తినాలని సూచిస్తుంటారు. అయితే ప్రొటీన్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి… అలాగే ఈ ప్రొటీన్స్ ఏ… ఏ ఆహార పదార్దాలలో దొరుకుతాయి… వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెల్సుకుందాం. ప్రొటీన్స్ లో ఎమినో యాసిడ్స్ గుణాలు ఉన్నాయి. అవి శరీరానికి కావల్సినంత శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తాయి. ప్రొటీన్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో […]
పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటిన్స్ ఇవ్వండి అని డాక్టర్లు చెబుతారు. అలాగే శరీరంలో కొంచెం సత్తువ తగ్గినా కూడా మంచి ప్రొటీన్ ఫుడ్ తినాలని సూచిస్తుంటారు. అయితే ప్రొటీన్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి… అలాగే ఈ ప్రొటీన్స్ ఏ… ఏ ఆహార పదార్దాలలో దొరుకుతాయి… వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెల్సుకుందాం.
- ప్రొటీన్స్ లో ఎమినో యాసిడ్స్ గుణాలు ఉన్నాయి. అవి శరీరానికి కావల్సినంత శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తాయి.
- ప్రొటీన్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ ఫెక్షన్స్ తో పోరాడతాయి.
- శరీరంలో మెటబాలిక్ ఫంక్షన్స్ ని అదుపు చేస్తాయి.
- ఎముకలు, కండరాల బలానికి ప్రొటీన్స్ సాయపడతాయి.
- గర్భణీలు ఖచ్చితంగా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఇది బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
- బలమైన కండరాలు, ఎముకల ఎదుగుదలకు ప్రొటీన్స్ ఎంతో దోహదపడతాయి.
- ప్రొటీన్స్ అనేక రోగాల బారి నుంచి కాపాడుతుంది. బ్లడ్ ప్రేషర్ అదుపులో ఉండడమే కాకుండా గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
- డైట్ లో ఉన్నవారు ప్రతిరోజు ప్రొటీన్ ఫుడ్ తింటే తొందరగా ఆకలి వేయదు.
- కొన్ని రకాల ప్రొటీన్స్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నిర్భయంగా తీసుకోవచ్చు.
ప్రొటీన్స్ మనకు ఏ ఆహారపదార్దలలో దొరుకుతాయో తెల్సుకుందాం…
- చేపలు లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి ఎంతో శక్తినివ్వడమే కాక అనేక రుతుసంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. చేపలు రిచ్ ప్రొటీన్ కంటెంట్.
- డ్రైఫ్రూట్స్ల్.. బాదం, పిస్తా, అక్రూట్ వంటి వాటిలలో కూడా ప్రొటీన్స్ అధికంగానే ఉంటాయి. అయితే వీటిని నేరుగా కాకుండా సలాడ్స్ తో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
- చిక్కుడు గింజలు, రాజ్మా, పచ్చి బఠాణీ వంటి శాకాహార కూరలలో ప్రొటీన్స్ అధికంగానే ఉంటాయి.
- పాలు, పన్నీర్ తో పాటు ఇతర పాల ఉత్పత్తులలో కూడా ప్రొటీన్స్ అధికంగానే ఉంటాయి. ఇవి కండరాలు, షుగర్, బీపీ వంటి వ్యాధులను అరికడతాయి.
- రెడ్ మీట్ అంటే మేక, గొర్రె, చికెన్ లలో కూడా ప్రొటీన్స్ లభిస్తాయి… అయితే వీటిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి సమతుల్యంగా తినాలని డాక్టర్లు చెబుతున్నారు.