Telugu Global
Cinema & Entertainment

శంకర్ తో ప్రభాస్ సినిమా లేదు

ఈ మధ్యనే ‘2.0’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శంకర్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తల పై రియాక్ట్ అయింది శంకర్ బృందం. ‘భారతీయుడు 2’ సినిమా కాకుండా శంకర్ మరే సినిమాపై దృష్టి పెట్టాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.  అంటే శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ […]

శంకర్ తో ప్రభాస్ సినిమా లేదు
X

ఈ మధ్యనే ‘2.0’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శంకర్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ వార్తల పై రియాక్ట్ అయింది శంకర్ బృందం. ‘భారతీయుడు 2’ సినిమా కాకుండా శంకర్ మరే సినిమాపై దృష్టి పెట్టాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అంటే శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఇప్పట్లో జరిగేది కాదన్నమాట.

మరోవైపు నిర్మాతలు తప్పుకోవడం వల్ల ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శంకర్ పలు ప్రముఖ నిర్మాతలతో సినిమా గురించి సంప్రదించారు.

ఎట్టకేలకు ఈ మధ్యనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ శంకర్ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అయితే బడ్జెట్ మరియు టైం విషయంలో కొన్ని కండిషన్లు పెట్టారట. అయినప్పటికీ సినిమా తీయడానికి వారు చెప్పిన బడ్జెట్ సరిపోవడంతో శంకర్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడు అని తెలుస్తోంది.

మరోవైపు ఈ మధ్యనే పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ కూడా మళ్ళీ సినిమాల వైపు మొగ్గు చూపుతూ ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూస్తూ ఉంటే ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని చెప్పవచ్చు.

First Published:  30 May 2019 12:53 AM GMT
Next Story