Telugu Global
Cinema & Entertainment

రెండు వారాలు ఆగమంటున్న మారుతి

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాతో ఒక మోస్తరు హిట్ ను అందుకున్నాడు. ఇక తన తదుపరి సినిమా కొనసాగించాలని ఆశ పడుతున్న సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రవితేజ ‘నేల టికెట్’ సినిమా లో హీరోయిన్ […]

రెండు వారాలు ఆగమంటున్న మారుతి
X

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాతో ఒక మోస్తరు హిట్ ను అందుకున్నాడు.

ఇక తన తదుపరి సినిమా కొనసాగించాలని ఆశ పడుతున్న సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

రవితేజ ‘నేల టికెట్’ సినిమా లో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మెగా హీరో సినిమాలో ఫ్లాప్ హీరోయిన్ ని తీసుకోవడం మెగా అభిమానులకు నచ్చలేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

తాజాగా మారుతీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు… “మా సినిమా గురించి వస్తున్న పుకార్లను వింటున్నాను. మా సినిమా పై ఆసక్తి చూపిస్తున్నందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. అధికారిక ప్రకటన రెండు వారాల్లో బయటకు రానుంది. అప్పటిదాకా దయచేసి వేచి చూడండి” అని పేర్కొన్నారు మారుతి. అంటే ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుందా లేదా తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సిందే.

First Published:  30 May 2019 1:42 AM GMT
Next Story