Telugu Global
Cinema & Entertainment

మరోసారి మహేష్ సినిమాకు దేవిశ్రీ సంగీతం

ఇప్పటికే మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలకు సంగీతం అందించాడు దేవిశ్రీప్రసాద్. తాజాగా ఈ కంపోజర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. అవును.. తన నెక్ట్స్ సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడు. ఈ ఎంపిక వెనక దర్శకుడు అనీల్ రావిపూడి హస్తం కూడా ఉంది. అనీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఎఫ్-2 సినిమా. సంక్రాంతికి ఆ సినిమా రిలీజైంది. అందుకే సెంటిమెంట్ […]

మరోసారి మహేష్ సినిమాకు దేవిశ్రీ సంగీతం
X

ఇప్పటికే మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలకు సంగీతం అందించాడు దేవిశ్రీప్రసాద్. తాజాగా ఈ కంపోజర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. అవును.. తన నెక్ట్స్ సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాడు. ఈ ఎంపిక వెనక దర్శకుడు అనీల్ రావిపూడి హస్తం కూడా ఉంది.

అనీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఎఫ్-2 సినిమా. సంక్రాంతికి ఆ సినిమా రిలీజైంది. అందుకే సెంటిమెంట్ కొద్దీ తన నెక్ట్స్ సినిమాను కూడా సంక్రాంతికే ప్లాన్ చేశాడు అనీల్. మరీ ముఖ్యంగా సెంటిమెంట్ ను మిస్ అవ్వకుండా.. ఎఫ్2కు సంగీతం అందించిన దేవిశ్రీనే మహేష్ మూవీకి కూడా తీసుకోవాలనుకున్నాడు. మహేష్ కు కూడా దేవిశ్రీ అంటే ఇష్టమే. సో.. దేవిశ్రీ ఎంట్రీ చాలా ఈజీ అయిపోయింది.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31న ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఎప్పట్లానే మహేష్ ఈ ఓపెనింగ్ కు హాజరుకాడు. తన సినిమాల ఓపెనింగ్స్ కు వెళ్లకూడదనేది మహేష్ సెంటిమెంట్. అనీల్ సుంకర నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు.

First Published:  29 May 2019 9:29 PM GMT
Next Story