Telugu Global
Cinema & Entertainment

తెలుగు 96 రీమేక్ లోనూ ఆమే నటిస్తోందట

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ’96’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సీ. ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కింది. తాజా సమాచారం ప్రకారం హీరో శర్వానంద్ తో ఇప్పటికే […]

తెలుగు 96 రీమేక్ లోనూ ఆమే నటిస్తోందట
X

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ’96’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సీ. ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కింది.

తాజా సమాచారం ప్రకారం హీరో శర్వానంద్ తో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. హీరో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో ప్రస్తుతం షూటింగ్ చేయనున్నారు.

తమిళ వెర్షన్ లో త్రిష చిన్నప్పటి పాత్ర పోషించిన గౌరీ కిషన్ ఈ సినిమాలో కూడా సమంత చిన్నప్పటి పాత్ర పోషించబోతోంది.

తాజాగా ఆమె సినిమా సెట్స్ లో నుంచి ఒక ఫోటో షేర్ చేసింది. జాను (సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు) గా తన జర్నీ ఇంకా పూర్తి అవలేదు అంటూ ఆమె పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సెప్టెంబరు లో లేదా అక్టోబరు లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  30 May 2019 1:56 AM GMT
Next Story