Telugu Global
NEWS

మూడు రోజులు జగన్ బిజీ బిజీ..!

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు బిజీ బిజీగా గడపనున్నారు. అమరావతిలో జగన్‌ను కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ కలుసుకుని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మంగళవారం సాయంత్రం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్తారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, పూజలు అనంతరం కడపకు వెళ్తారు. అక్కడ దేవాలయంలో పూజలు, దర్గాలో పూజలు, చర్చిలో […]

మూడు రోజులు జగన్ బిజీ బిజీ..!
X

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు బిజీ బిజీగా గడపనున్నారు. అమరావతిలో జగన్‌ను కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ కలుసుకుని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మంగళవారం సాయంత్రం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్తారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, పూజలు అనంతరం కడపకు వెళ్తారు.

అక్కడ దేవాలయంలో పూజలు, దర్గాలో పూజలు, చర్చిలో ప్రార్థనలు అనంతరం తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరం వస్తారు. గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి విజయవాడ దుర్గాదేవిని దర్శించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదే రోజు సాయంత్రం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు గవర్నర్ నరసింహన్ తో సహా ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అక్కడ ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం శుక్రవారం నాడు నేరుగా అమరావతి చేరుకుంటారు. ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాలు దగ్గరుండి చూస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  28 May 2019 12:19 AM GMT
Next Story