Telugu Global
Cinema & Entertainment

సతీష్ వేగేశ్న తో కళ్యాణ్ రామ్

118 అనే సినిమా తో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్… ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులని పలకరించాలి అని అనుకుంటున్నాడు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా లేరు. ఇప్పుడు శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, దొంగల బండి సినిమాలు చేసిన ఫ్యామిలీ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం లో ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే శ్రీనివాస కళ్యాణం అవ్వగానే ఒక యువ హీరో కోసం సతీష్ ఒక కథ […]

సతీష్ వేగేశ్న తో కళ్యాణ్ రామ్
X

118 అనే సినిమా తో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్… ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులని పలకరించాలి అని అనుకుంటున్నాడు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా లేరు.

ఇప్పుడు శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, దొంగల బండి సినిమాలు చేసిన ఫ్యామిలీ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం లో ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే శ్రీనివాస కళ్యాణం అవ్వగానే ఒక యువ హీరో కోసం సతీష్ ఒక కథ రాసుకున్నాడు. ఇప్పుడు అది పక్కన పెట్టి కళ్యాణ్ రామ్ తో సినిమా ని పట్టాలెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.

సతీష్ ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన తుది మెరుగులు దిద్దుతున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికం గా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

అంతే కాకుండా మల్లాది వశిష్ట్ అనే కొత్త దర్శకుడి తో కళ్యాణ్ రామ్ తుగ్లక్ అనే సినిమాని కూడా ఒప్పుకున్నాడు. ఇది కూడా త్వరలో ప్రారంభం కానుంది.

First Published:  28 May 2019 12:51 AM GMT
Next Story