Telugu Global
National

సల్మాన్‌ ఖాన్‌ నోటి దూల

సల్మాన్‌ ఖాన్‌ మంచి నటుడే కావచ్చు… లక్షలాది మంది అభిమానులు ఉండవచ్చు కానీ స్త్రీల విషయంలో అతని ప్రవర్తన, అతని మాట తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. చాలా ఏళ్ళ క్రిందట నాతో గడపడానికి చాలామంది స్త్రీలు క్యూ కడతారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇంకో సందర్భంలో షారూఖ్‌ ఖాన్‌ మరో ప్రముఖ హీరోయిన్‌ కలిసి నటిస్తున్న షూటింగ్‌ స్పాట్‌కు వెళ్ళాడు. తనతో బయలుదేరమని ఆ హీరోయిన్‌ను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించింది. దీంతో జుట్టుపట్టుకుని ఆమెను కారులోకి లాక్కొని […]

సల్మాన్‌ ఖాన్‌ నోటి దూల
X

సల్మాన్‌ ఖాన్‌ మంచి నటుడే కావచ్చు… లక్షలాది మంది అభిమానులు ఉండవచ్చు కానీ స్త్రీల విషయంలో అతని ప్రవర్తన, అతని మాట తీరు ఎప్పుడూ వివాదాస్పదమే.

చాలా ఏళ్ళ క్రిందట నాతో గడపడానికి చాలామంది స్త్రీలు క్యూ కడతారు అంటూ వ్యాఖ్యానించాడు.

ఇంకో సందర్భంలో షారూఖ్‌ ఖాన్‌ మరో ప్రముఖ హీరోయిన్‌ కలిసి నటిస్తున్న షూటింగ్‌ స్పాట్‌కు వెళ్ళాడు. తనతో బయలుదేరమని ఆ హీరోయిన్‌ను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించింది. దీంతో జుట్టుపట్టుకుని ఆమెను కారులోకి లాక్కొని వెళ్ళాడు. స్త్రీలకు సంబంధించి అతని జీవితంలో ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో….

తాజాగా ఇప్పుడు సల్మాన్‌ హీరోగా నటించిన భారత్ విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల సందర్భంగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సల్మాన్‌ ఖాన్‌. భారత్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటించడానికి మొదట ప్రియాంక ఒప్పుకున్నది. ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నది. ఆ తర్వాత కొద్దిరోజులకే పెళ్లి చేసుకుంది.

ఆమె స్థానంలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్‌ను తీసుకుని సినిమా తీశారు. సినిమా పూర్తయింది. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సల్మాన్‌ ఖాన్‌… ఈ సినిమా నుంచి ప్రియాంక అర్ధాంతరంగా వెళ్ళిపోయింది…. మాకేం నష్టం లేదు…. ఆమె మొగుడి కోసం నా సినిమా వదులుకుంది…. నా సినిమా కోసం చాలా మంది ఆడవాళ్ళు మొగుళ్ళని వదిలేసి వస్తారు…. అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.

అంటే నర్మగర్భంగా నాకోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్ళని వదిలేసి వస్తారు అన్నట్లుగా మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు చాలామంది స్త్రీలు సల్మాన్‌ ను తప్పుబడుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

First Published:  28 May 2019 7:02 AM GMT
Next Story