Telugu Global
Cinema & Entertainment

చరణ్ లేకుండా షూటింగ్ చేస్తున్న తారక్

ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నాడు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు ఇద్దరూ గాయాలు పాలయ్యాక షూట్ డిలే అవ్వడం తో మరలా చిత్ర యూనిట్ నుండి అప్డేట్స్ ఏమి రాలేదు. కానీ ఫిలిం నగర్ వర్గాల కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగకుండా జరుగుతుంది. హీరోలు రెస్ట్ తీసుకుంటూ ఉంటె దర్శకుడు మిగిలిన ఆర్టిస్ట్స్ తో సినిమా షూటింగ్ సాగిస్తున్నాడు అని వినికిడి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామ్ […]

చరణ్ లేకుండా షూటింగ్ చేస్తున్న తారక్
X

ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నాడు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు ఇద్దరూ గాయాలు పాలయ్యాక షూట్ డిలే అవ్వడం తో మరలా చిత్ర యూనిట్ నుండి అప్డేట్స్ ఏమి రాలేదు. కానీ ఫిలిం నగర్ వర్గాల కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగకుండా జరుగుతుంది.

హీరోలు రెస్ట్ తీసుకుంటూ ఉంటె దర్శకుడు మిగిలిన ఆర్టిస్ట్స్ తో సినిమా షూటింగ్ సాగిస్తున్నాడు అని వినికిడి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామ్ చరణ్ లేకుండా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో తారక్ ఒక్కడే పాల్గొంటున్నాడు.

రాజమౌళి…. కొద్ది రోజులు బ్రేక్ రావడం తో గ్రాఫిక్స్ టీమ్ ని కో ఆర్డినేట్ చేసాడట. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ లో బిజీ అయ్యాడు అని తెలుస్తుంది. ఇప్పుడు తారక్ ప్రధానంగా సినిమా యూనిట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. సినిమా లో ఇంటర్వెల్ టైం లో ఈ సన్నివేశం వస్తుంది అని తెలుస్తోంది. త్వరలో నే చరణ్ కూడా షూట్ లో పాల్గొంటాడు. డీ వీ వీ దానయ్య నిర్మాణం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  28 May 2019 6:28 AM GMT
Next Story