Telugu Global
NEWS

చంద్రబాబుపై నాగబాబు సానుభూతి.... నెటిజన్ల కౌంటర్

ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యర్థులను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. తన అధికార బలం.. బలమైన మీడియాతో వైసీపీని, ప్రతిపక్షాలను టార్గెట్ చేశాడు. కానీ ఇప్పుడు బాబు ఓడిపోయాడు. గెలిచిన ప్రత్యర్థులు కూడా ఏమీ అనడం లేదు. కానీ వైసీపీ, జనసేన ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే మొన్నటివరకు చంద్రబాబును తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎండగట్టిన […]

చంద్రబాబుపై నాగబాబు సానుభూతి.... నెటిజన్ల కౌంటర్
X

ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యర్థులను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. తన అధికార బలం.. బలమైన మీడియాతో వైసీపీని, ప్రతిపక్షాలను టార్గెట్ చేశాడు.

కానీ ఇప్పుడు బాబు ఓడిపోయాడు. గెలిచిన ప్రత్యర్థులు కూడా ఏమీ అనడం లేదు. కానీ వైసీపీ, జనసేన ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే మొన్నటివరకు చంద్రబాబును తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎండగట్టిన నాగబాబు ఇప్పుడు సడన్ గా ఆయనకు మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. ఎందుకంటే నాగబాబు కూడా ఓటమి భారంతోనే ఉండడంతో బాబుపై సానుభూతి కురిపించినట్టు తెలుస్తోంది.

తాజాగా యాంటీ టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి బాబుపై ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబును కించపరిచేలా కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. దీనిపై నాగబాబు స్పందించాడు.

చంద్రబాబు గారు మన మాజీ ముఖ్యమంత్రి…. ఓడినంత మాత్రాన విమర్శించడం తప్పు. పవర్ లో ఉండగా విమర్శిస్తే పర్లేదు కానీ ఓడాక విమర్శించడం చేతకానితనం…. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలేయాలి…. అవకాశం ఉంది కదా అని ట్రోల్ చేయవద్దని నాగబాబు ఫేస్ బుక్ పోస్టులో సూచించారు.

కాగా ఎన్నికలకు ముందు.. ఇప్పుడు కూడా చంద్రబాబుకు జనసేన సపోర్టేనా అని నెటిజన్లు నాగబాబు పోస్టు కు విమర్శలతో జవాబిస్తున్నారు.

చంద్రబాబు గారు మన ex సీఎం..ఇప్పుడు defeat అయినంత మాత్రాన ఆయన్న దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా…

Posted by Naga Babu on Monday, 27 May 2019

First Published:  28 May 2019 3:55 AM GMT
Next Story