Telugu Global
Cinema & Entertainment

మహేష్ మూవీకి టైటిల్ ఫిక్స్

మొన్నటివరకు ‘రెడ్డిగారి అబ్బాయ్’ అనే టైటిల్ చక్కర్లు కొట్టింది. కానీ తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి వచ్చినవి పుకార్లు కావు. అదే నిజం. అవును.. మహేష్ కొత్త సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి స్వయంగా బయటపెట్టాడు. తాజాగా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు అనీల్. ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇప్పుడు ఆఫ్-ది-రికార్డు […]

మహేష్ మూవీకి టైటిల్ ఫిక్స్
X

మొన్నటివరకు ‘రెడ్డిగారి అబ్బాయ్’ అనే టైటిల్ చక్కర్లు కొట్టింది. కానీ తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి వచ్చినవి పుకార్లు కావు. అదే నిజం. అవును.. మహేష్ కొత్త సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి స్వయంగా బయటపెట్టాడు.

తాజాగా సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు అనీల్. ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇప్పుడు ఆఫ్-ది-రికార్డు టైటిల్ కూడా మీడియాకు చెప్పేశాడు. దిల్ రాజు నిర్మాతగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనేది ప్లాన్.

ఈ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇస్తున్నారు బండ్ల గణేశ్, విజయశాంతి. మొన్నటివరకు రాజకీయాలతో బిజీగా గడిపిన ఈ ఇద్దరు నటులు, మహేష్ కొత్త సినిమాలో 2 కీలక పాత్రలు పోషించబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాను త్వరలోనే లాంఛ్ చేయబోతున్నారు.

First Published:  27 May 2019 1:32 AM GMT
Next Story