Telugu Global
Cinema & Entertainment

వక్కంతం వంశీ కి రెండో అవకాశం

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తో దర్శకుడి గా అరంగేట్రం చేసిన వక్కంతం వంశీ ప్రస్తుతం తన రెండో సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. మొదటి సినిమా తో అందరినీ మెప్పించలేకపోయినా అల్లు అర్జున్ ని, గీతా ఆర్ట్స్ ప్రతినిధులని మాత్రం మెప్పించడం తో వంశీ కి తమ నిర్మాణ సంస్థ లో స్క్రిప్ట్స్ మానిటరింగ్ చేసే పనిని అప్పగించాడు అల్లు అరవింద్. ఆ పని తో […]

వక్కంతం వంశీ కి రెండో అవకాశం
X

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తో దర్శకుడి గా అరంగేట్రం చేసిన వక్కంతం వంశీ ప్రస్తుతం తన రెండో సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.

మొదటి సినిమా తో అందరినీ మెప్పించలేకపోయినా అల్లు అర్జున్ ని, గీతా ఆర్ట్స్ ప్రతినిధులని మాత్రం మెప్పించడం తో వంశీ కి తమ నిర్మాణ సంస్థ లో స్క్రిప్ట్స్ మానిటరింగ్ చేసే పనిని అప్పగించాడు అల్లు అరవింద్. ఆ పని తో పాటు వంశీ తన కథ కి సంబంధించి స్క్రిప్ట్ పూర్తి చేసి హీరో కోసం చూస్తున్నాడట.

అయితే తన రెండో సినిమా కథ కి నాని అయితే సరిగ్గా సరిపోతాడని వంశీ ఆలోచిస్తున్నాడట. మరి కొద్ది రోజుల్లో నానిని కలిసి తన కథని చెప్పాలనే ప్రయత్నాలు కూడా వంశీ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

ఇక పోతే ఈ సినిమా కి బండ్ల గణేష్ నిర్మాత గా వ్యవహరించనున్నట్లు సమాచారం. బండ్ల గణేష్ తిరిగి సినిమా నిర్మాణం లో కి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. తన టెంపర్ కి కథ అందించిన వంశీ తో ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకొని మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ లో విజృంభించాలనేది గణేష్ ప్లాన్ అంట.

First Published:  26 May 2019 1:09 AM GMT
Next Story