Telugu Global
Cinema & Entertainment

పెళ్లిపై శింబు క్లారిటీ

“నా పెళ్లికి సంబంధించి ఈమధ్య కాలంలో వస్తున్న పుకార్లు విన్నాను. మీ అందరికీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు పెళ్లి ప్లాన్స్ లేవు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఓ మంచి మాధ్యమం ద్వారా మీ అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తాను.” సడెన్ గా తన పెళ్లిపై హీరో శింబు ఇచ్చిన ప్రకటన ఇది. ఇప్పటికే పెళ్లి వయసు కూడా దాటింది ఈ బ్యాచిలర్ కు. కానీ ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. పైపెచ్చు తను […]

పెళ్లిపై శింబు క్లారిటీ
X

“నా పెళ్లికి సంబంధించి ఈమధ్య కాలంలో వస్తున్న పుకార్లు విన్నాను. మీ అందరికీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు పెళ్లి ప్లాన్స్ లేవు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఓ మంచి మాధ్యమం ద్వారా మీ అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తాను.”

సడెన్ గా తన పెళ్లిపై హీరో శింబు ఇచ్చిన ప్రకటన ఇది. ఇప్పటికే పెళ్లి వయసు కూడా దాటింది ఈ బ్యాచిలర్ కు. కానీ ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. పైపెచ్చు తను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మరోసారి స్పష్టం చేశాడు.

ఇలా ఉన్నఫలంగా, ఇప్పటికిప్పుడు శింబు ఇలా తన పెళ్లిపై స్పందించడానికి ఓ కారణం ఉంది. శింబు, హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు ప్రారంభమయ్యాయి. గతంలో వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మేటర్ పెద్దల వరకు కూడా వెళ్లింది. ఇక పెళ్లి ఒక్కటే పెండింగ్ అనుకునే టైమ్ లో ఇద్దరూ విడిపోయారు.

అలా విడిపోయిన ఈ జంట ఇప్పుడు మళ్లీ కలిసింది. కలిసి సినిమాలు కూడా చేసింది. దీంతో వీళ్ల పెళ్లిపై మళ్లీ పుకార్లు ప్రారంభమయ్యాయి. అందుకే శింబు ఇలా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.

First Published:  26 May 2019 6:00 AM GMT
Next Story