Telugu Global
Health & Life Style

సంపూర్ణ ఆరోగ్యానికి.... విటమిన్ బి 3

మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం. ఇందుకోసం విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, క్యాల్షియం ఇలా అన్ని రకాల పోషకాలు కావాలి. అయితే ఏ పోషకాలు దేనికి ఎక్కువగా పనిచేస్తాయో తెలుసుకునే అవసరం ఎంతైన ఉంది. ఈ రోజు విటమిన్ బి3… వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం. విటమిన్ బి3 కి మరోపేరు నియాసిన్. ఇది శరీరంలో కొవ్వును అదుపు చేయడానికి ఎంతో దోహదపడుతుంది. విటమిన్ బి3 జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతే […]

సంపూర్ణ ఆరోగ్యానికి.... విటమిన్ బి 3
X

మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం. ఇందుకోసం విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, క్యాల్షియం ఇలా అన్ని రకాల పోషకాలు కావాలి. అయితే ఏ పోషకాలు దేనికి ఎక్కువగా పనిచేస్తాయో తెలుసుకునే అవసరం ఎంతైన ఉంది. ఈ రోజు విటమిన్ బి3… వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

  • విటమిన్ బి3 కి మరోపేరు నియాసిన్. ఇది శరీరంలో కొవ్వును అదుపు చేయడానికి ఎంతో దోహదపడుతుంది.
  • విటమిన్ బి3 జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతే కాదు కండరాలు, ఎముకల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ విటమిన్ బి3 ఎంతో అవసరం.
  • నియాసిన్ రక్తంలో చక్కెర స్దాయిని అదుపు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
  • చర్మాన్ని కాంతివంతగా తయారు చేయడానికి విటమిన్ బి3 ఎంతో సాయపడుతుంది.
  • శరీరంలో నాడీ వ్యవస్దను పటిష్ట పరచడంలో విటమిన్ బి3 ఎంతో అవసరం.
  • విటమిన్ బి3 రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్దాయిలను అదుపు చేస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు.
  • గర్బీణీలకు, కడుపులో పిండం ఎదుగుదలకు విటమిన్ బి3 ఎంతో అవసరం.
  • కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి పురుషులకు రోజుకి దాదాపు 15 మిల్లీ గ్రాముల నుంచి 20 మిల్లీ గ్రాముల వరకు విటమిన్ బి3 అవసరం.
  • స్త్రీలకు 12 మిల్లీగ్రాముల నుంచి 15 మిల్లీగ్రాముల వరకు విటమిన్ బి 3 అవసరం.
  • వృద్దాప్యంలో వచ్చే మతిమరుపు అంటే అల్జీమర్స్ వ్యాధిని విటమిన్ బి3 ద్వారా నివారించవచ్చును.
  • వయస్సు రీత్యా వచ్చే కీళ్ల నొప్పులకు కూడా విటమిన్ బి3 లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు.

ఇన్ని ఉపయోగాలున్న విటమిన్ బి3 ఏ ఆహార పదార్దలలో ఉంటుందో తెల్సుకుందాం..

  • గ్రీన్ పీస్, రాజ్మా, బ్రొకోలి, వేరుశనగ, క్యారెట్, కాప్సికం, పుట్టగొడుగులు, టర్కీ కోడి, పందిమాంసం, చేపలు, చికెన్ బ్రెస్ట్, రెడ్ మీట్, చిక్కుడు గింజలు, ఆకుకూరలలో విటమిన్ బి3 అధికంగా ఉంటుంది.
First Published:  24 May 2019 12:35 PM GMT
Next Story