Telugu Global
NEWS

కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్

పోస్టల్ బ్యాలెట్. పెద్దగా ఎవరూ దృష్టి పెట్టని అంశం. ఏ ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ పట్ల ఏ రాజకీయ పార్టీ ఆసక్తి కనబర్చకపోవడం విశేషం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికల సమరంలో ప్రతీ ఓటూ ఎంతో కీలకంగా మారింది. దీంతో అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ వైపు మళ్ళింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లు […]

కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్
X

పోస్టల్ బ్యాలెట్. పెద్దగా ఎవరూ దృష్టి పెట్టని అంశం. ఏ ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ పట్ల ఏ రాజకీయ పార్టీ ఆసక్తి కనబర్చకపోవడం విశేషం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికల సమరంలో ప్రతీ ఓటూ ఎంతో కీలకంగా మారింది. దీంతో అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ వైపు మళ్ళింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లుగా అంచనా. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ను విడుదల చేసింది. ఇందులో 80 శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోస్టల్ బ్యాలెట్ లను సంబంధిత శాఖలకు పంపించారని కూడా చెబుతున్నారు.

అయితే ఆ ఓట్లలో ఎన్ని ఓట్లు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయి… ఎన్ని ఓట్లు ప్రతిపక్షాలకి పడ్డాయి అనేది గురువారం నాడే తేలనుంది. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ లను వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వేశారని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.

అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు తాము ఎంతో చేశామని, చంద్రబాబు నాయుడే మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారని బావిస్తోంది. ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన జనసేన మాత్రం పోస్టల్ బ్యాలెట్ లపై ఎటువంటి ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలోనూ 500 నుంచి 1500 వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని ఓ అంచనా. విజయానికి ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారిన దశలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారో, ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారో తేలాలంటే 24 గంటలు నిరీక్షించాల్సిందే.

First Published:  21 May 2019 9:14 PM GMT
Next Story