Telugu Global
Cinema & Entertainment

పెద్ద సినిమాల మీదే కన్నేసిన డీఎస్పీ

టాలీవుడ్ లో ఉన్న టాప్ సంగీత దర్శకులలో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనుభవిస్తున్న దేవిశ్రీ పై గత కొంత కాలంగా కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేవిశ్రీ కి సంగీతం పై పట్టు పోయిందని, తన పాటలు ఈ మధ్య రొటీన్ గా ఉంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘మహర్షి’ సినిమాలో కూడా దేవిశ్రీ అందించిన సంగీతం పెద్దగా ఉపయోగపడలేదు. దీనితో మహేష్ బాబు అభిమానులు కూడా […]

పెద్ద సినిమాల మీదే కన్నేసిన డీఎస్పీ
X

టాలీవుడ్ లో ఉన్న టాప్ సంగీత దర్శకులలో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనుభవిస్తున్న దేవిశ్రీ పై గత కొంత కాలంగా కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేవిశ్రీ కి సంగీతం పై పట్టు పోయిందని, తన పాటలు ఈ మధ్య రొటీన్ గా ఉంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ‘మహర్షి’ సినిమాలో కూడా దేవిశ్రీ అందించిన సంగీతం పెద్దగా ఉపయోగపడలేదు. దీనితో మహేష్ బాబు అభిమానులు కూడా రాక్ స్టార్ పై నిరాశ చెందుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేయబోతున్నాడట.

ఈ నేపథ్యంలో నాలుగైదు సినిమాల నుంచి తప్పుకొని కేవలం బడా ప్రాజెక్టులను మాత్రమే లైన్ లో ఉంచుకున్నాడు. అవే చిరంజీవి-కొరటాల శివ, మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమాలు. ఈ రెండు సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించి మళ్లీ ఫామ్ లోకి రావాలని దేవిశ్రీ ఆలోచన. వేరే దేనిపైనా దృష్టి పెట్టకుండా కేవలం ఈ రెండు సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇవే కాకుండా వైష్ణవ తేజ్ సినిమా కూడా డీఎస్పీ చేతుల్లో ఉంది. మరి దేవిశ్రీ ఈసారైనా ఫార్మ్ లోకి వస్తాడా లేదా చూడాలి.

First Published:  21 May 2019 11:37 PM GMT
Next Story